Hand Dryer: హ్యాండ్ డ్రైయర్‌తో చేతులు ఆరబెట్టుకోవడం సురక్షితమా.. కాదా.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..

హ్యాండ్ డ్రైయర్‌పై చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాష్‌ రూమ్‌లో చేతులు ఆరబెట్టుకోవడం చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా హ్యాండ్ డ్రైయర్‌తో మీ చేతులను ఆరబెడితే, తప్పకుండా ఈ వార్త చదవండి.

Hand Dryer: హ్యాండ్ డ్రైయర్‌తో చేతులు ఆరబెట్టుకోవడం సురక్షితమా.. కాదా.. తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు..
Hand Dryer
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 12, 2023 | 6:44 PM

కార్పోరేట్ ఆఫీసుల్లో.. సినిమా థియేటర్లలో.. మాల్స్‌లో రెస్ట్ రూమ్‌కు వెళ్తే ఇవి ఎక్కవగా కనిపిస్తాయి. మీరు మీ చేతులను చాలాసార్లు కడుక్కున్న తర్వాత హ్యాండ్ డ్రైయర్‌తో మీ చేతులను ఆరబెడుతుంటాం. అయితే మీరు ఈ వార్తను తప్పక చదవండి. నిపుణులు హ్యాండ్ డ్రైయర్ల గురించి ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తమ చేతులు కడుక్కున్న తర్వాత తాము సూక్ష్మక్రిమి లేనివారమని అనుకుంటారు. కాని వారు హ్యాండ్ డ్రైయర్‌తో చేతులు ఆరబెట్టినప్పుడు, వారు మళ్లీ వ్యాధి బారిన పడతారు. ఈ యంత్రం పనిచేసే తీరు ఇన్ఫెక్షన్‌కు కారణమని నిపుణులు చెబుతున్నారు. దానిని బాగా అర్థం చేసుకుందాం…

ఇది ఈ విధంగా సోకుతుందంటే..

అంతర్జాతీయ పత్రిక డెయిల్ మెయిల్ అందించిన రిపోర్ట్ ప్రకారం, గాలిలో మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ఉన్నాయి. మీరు హ్యాండ్ డ్రైయర్ కింద మీ చేతులను ఆరబెట్టినప్పుడు.. అది ఈ బ్యాక్టీరియాను లాగి మీ చేతులపైకి విసిరివేస్తుంది. చేతుల్లో తేమ ఉండడం వల్ల అవి చర్మానికి అతుక్కుపోతాయి. పబ్లిక్ వాష్‌రూమ్‌లలో పెద్ద సంఖ్యలో ఇ.కోలి, హెపటైటిస్, ఫీకల్ బ్యాక్టీరియా ఉన్నట్లు గతంలో జరిగిన పరిశోధనలో వెల్లడైంది.

77వేల రకాల బ్యాక్టీరియా, వైరస్

పరిశోధన సమయంలో ఏ బ్యాక్టీరియా కనుగొనబడిందో నివేదిక పేర్కొననప్పటికీ.. ఇన్‌ఫ్లుఎంజా, సాల్మొనెల్లా, షిగెల్లా, నోరోవైరస్, స్ట్రెప్టోకోకస్ పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లలో కనుగొనబడినట్లు మునుపటి పరిశోధనలు సూచించాయి. 2015లో నిర్వహించిన పరిశోధనలో రెస్ట్‌రూమ్‌లో దాదాపు 77000 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు ఉన్నాయని తేలింది.

ఇలా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది

పరిశోధన నివేదికల ప్రకారం, టాయిలెట్‌ను ఫ్లష్ చేసినప్పుడు, ఈ బ్యాక్టీరియా వాష్‌రూమ్ అంతటా వ్యాపిస్తుంది. పబ్లిక్ వాష్‌రూమ్‌లలో హ్యాండ్ డ్రైయర్‌లకు బదులు పేపర్ టవల్స్ వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పేపర్ టవల్స్, హ్యాండ్ డ్రైయర్‌లతో ఎవరు సురక్షితంగా ఉంటారు?

2015లో జెట్ ఎయిర్ డ్రైయర్‌లు, పేపర్ టవల్స్‌పై పరిశోధన చేసింది వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం. వీరి అధ్యయనంలో, జెట్ ఎయిర్ డ్రైయర్‌లో ఈస్ట్ 59 కాలనీలు కనుగొనబడ్డాయి. పేపర్ టవల్‌లో ఈ సంఖ్య 6.5 మాత్రమే. బలమైన గాలి కారణంగా, ఈ బ్యాక్టీరియా ముఖానికి కూడా చేరుతుంది. హ్యాండ్ డ్రైయర్‌తో చేతులు ఆరబెట్టుకుంటున్నారా.. ఇది చాలా ప్రమాదం అటా.. నిపుణుల తాజా రిపోర్టు

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం