AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 15 సంవత్సరాల పగ.. ముఖం చూసుకుంటే ఒట్టు.. కానీ ఆ సీన్‌ అందరినీ మార్చేసింది..

పగలు ప్రతీకారాలతో గత 15 సంవత్సరాలుగా ఒకరి ముఖం చూసుకోకుండా ఉన్న దాయాదులను ‘బలగం’ సినిమా ఒక్కటి చేసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలం మాసన్ పల్లి చెందిన 8 నాయి బ్రాహ్మణ కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తున్న సమయంలో భూ తగాదాలు,

Telangana: 15 సంవత్సరాల పగ.. ముఖం చూసుకుంటే ఒట్టు.. కానీ ఆ సీన్‌ అందరినీ మార్చేసింది..
Balagam Movie
Shiva Prajapati
|

Updated on: Apr 12, 2023 | 10:22 PM

Share

పగలు ప్రతీకారాలతో గత 15 సంవత్సరాలుగా ఒకరి ముఖం చూసుకోకుండా ఉన్న దాయాదులను ‘బలగం’ సినిమా ఒక్కటి చేసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకొంది. వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలం మాసన్ పల్లి చెందిన 8 నాయి బ్రాహ్మణ కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తున్న సమయంలో భూ తగాదాలు, ఇంటి స్థలాల గోడవలతో పగలు ప్రతికారాలతో దూరంగా ఉండే వారు. కుటుంబ పరిస్థితులు బాగోలేక కొందరు హైదరాబాద్ వలస వెళ్లారు. అక్కడ ఎవరికీ వారు జీవిస్తున్నా.. ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. పిల్లలు సైతం పగలతో, కక్షతో రగిలిపోయేవారు.

ఒకరిపై ఒకరు కసి పెంచుకోవడం, కక్షలతో దూరంగా ఉంటూ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు బలగం సినిమా తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను వీరంతా చూశారు. ఆ సినిమాలోని సన్నివేశాలను చూసి చలించిపోయారు. ఇన్ని రోజులు పగలు ప్రతీకారాలతో చాలా తప్పు చేశామని గ్రహించారు. కలసి ఉంటే కలదు సుఖం అని.. హైదరాబాద్‌లో ఉన్న వారంతా తమ స్వగ్రామం అయిన మాసన్ పల్లికి సోమావారం చేరుకొన్నారు. దాయాదుల కుటుంబాల వారు, వారి పిల్లలు కలసి బలగం సినిమా గురించి చర్చించుకొన్నారు. పగలు, గొడవలు పక్కన పెట్టి కలిసుండాలని నిర్ణయించుకున్నారు.

మంగళవారం అందరూ కలిసి విందు చేసుకున్నారు. బలగం సినిమా తీసిన వారికి ధాన్యవాదాలు తెలిపారు. 8 కుటుంబాలకు చెందిన మంగలి రమేష్, రాజు, సాయిలు, గంగారాం, నాగరాజు, పెద్ద రమేష్, కృష్ణ, మల్లేష్, నారాయణ, కుమార్, నర్సింహ, వీఠల్, జనార్దన్, కుటుంబాల వారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పగతో తోబుట్టువులను, దాయదులను కలవలేని స్థితిలో ఉన్న వీరిని.. బలగం సినిమా కలపడం అదృష్టంగా భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..