Viral Video: ఇల్లు ఊడుస్తుండగా కదిలిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్ కుప్పలు తెప్పలుగా..!

ఇంటిని శుభ్రం చేస్తుంటే చిన్న చిన్న పురుగులు, కీటకాలు రావడం సహజం. అయితే, ఈ ఇంటి నుంచి మాత్రం ఒకటి కాదు రెండు కాదు.. కుప్పలు తెప్పలుగా పాములు బయటకొచ్చాయి. మొదట చిన్న పాము పిల్ల కనిపించగా.. దాని వెంటనే ఒక్కొక్కటిగా 39 పాములు బయటకొచ్చాయి.

Viral Video: ఇల్లు ఊడుస్తుండగా కదిలిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్ కుప్పలు తెప్పలుగా..!
Snakes
Follow us

|

Updated on: Apr 12, 2023 | 10:10 PM

ఇంటిని శుభ్రం చేస్తుంటే చిన్న చిన్న పురుగులు, కీటకాలు రావడం సహజం. అయితే, ఈ ఇంటి నుంచి మాత్రం ఒకటి కాదు రెండు కాదు.. కుప్పలు తెప్పలుగా పాములు బయటకొచ్చాయి. మొదట చిన్న పాము పిల్ల కనిపించగా.. దాని వెంటనే ఒక్కొక్కటిగా 39 పాములు బయటకొచ్చాయి. అది చూసి ఆ ఇంటి వాసుల గుండె గుభేల్‌మంది. ఆ పాములను చూసి కేకలు వేయడం వారి వంతైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వవరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని గోండియా నగరంలో ఓ మహిళా పని మనిషి ఇంటిని శుభ్రం చేస్తోంది. ఈ క్రమంలో డోర్ పక్కకు నెట్టి ఊడుస్తోంది. ఆ తలుపు వెనక చిన్న రంద్రంలో పాము పిల్ల కనిపించింది. దెబ్బకు అదిరిపోయిన ఆ మహిళ గట్టిగా కేకలు వేస్తూ అరిచింది. వెంటనే అలర్ట్ అయిన ఇంటి యజమానులు.. ఆ పామును బయటకు తీశారు. అయితే, ఆ పామును అలా తీయడమే ఆలస్యం.. వెనువెంటనే ఒక్కొక్కటిగా పాములు బయటకు వచ్చేశాయి. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 39 పాములు బయటకు వచ్చాయి. వాటిని చూసి బెదిరిపోయిన ఇంటి సభ్యులు.. కేకలు వేస్తూ ఇంటి బయటకు పరుగులు తీశారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.

పాములు ఉన్న ప్రాంతానికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. తలుపు ఫ్రేమ్, టైల్స్ పగలగొట్టగా అందులో చాలా పాములు కనిపించాయి. కుప్పలు కుప్పలుగా ఉన్న ఆ పాములను చూసి అతను సైతం షాక్‌కు గురయ్యాడు. అయితే, నాలుగు గంటల పాటు శ్రమించి దాదాపు 39 పాములను పట్టుకున్నాడు. ఆ పాములన్నింటినీ ప్లాస్టిక్ డబ్బాలో వేసి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. కాగా, ఇంట్లో బయటకొచ్చిన ఈ పాములు.. విషపూరితమైనవి కాదని స్నేక్ క్యాచర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రైన్‌లో రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు.. !
ట్రైన్‌లో రైల్వే ఉద్యోగిని కొట్టి చంపిన ప్రయాణికులు.. !
భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా
భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసిన భర్త.. అందులో ఒక ఫోటో చూడగా
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి..
హెల్తీ హెయిర్ కోసం బొప్పాయి హెయిర్ మాస్క్ ను ట్రై చేయండి..
100 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ దిగ్గజం సరికొత్త చరిత్ర
100 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ఫుట్‌బాల్ దిగ్గజం సరికొత్త చరిత్ర
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం నయా పాలసీ
అక్కో.. తల ఎట్టుంది..? ఎన్ని కుట్లు పడ్డాయ్...
అక్కో.. తల ఎట్టుంది..? ఎన్ని కుట్లు పడ్డాయ్...
అత్యధిక వడ్డీ వచ్చేది ఇక్కడే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్..
అత్యధిక వడ్డీ వచ్చేది ఇక్కడే.. ఎఫ్‌డీ చేయాలంటే ఇవే బెస్ట్..
నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్..
నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్..
విదేశాల చదువులు వారికే పరిమితం..సంచలన నివేదికలో వాస్తవాలు ఏంటంటే?
విదేశాల చదువులు వారికే పరిమితం..సంచలన నివేదికలో వాస్తవాలు ఏంటంటే?
డయాబెటిస్‌ బాధితులు స్వీట్లకే కాదు.. వీటికి కూడా దూరంగా ఉండాలి
డయాబెటిస్‌ బాధితులు స్వీట్లకే కాదు.. వీటికి కూడా దూరంగా ఉండాలి