Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. అక్కా.. అది పామునుకున్నావా.?  పొట్లకాయనుకున్నావా..?

Viral Video: సాధారణంగా ఆడవాళ్లు చిన్నొ బొద్దింకను చూస్తే వామ్మో అని గట్టిగా అరుస్తూ అంతెత్తు ఎగురుతారు. అలాంటి ఏకంగా పాము కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా?! పైప్రాణాలు పైకే. కానీ, ఇక్కడ ఓ మహిళ మాత్రం అత్యంత ప్రమాకరమైన, విషపూరితమైన పామును అదేదో పొట్లకాయ మాదిరిగా, ఏమాత్రం భయం బెరుకు లేకుండా..

Viral Video: వామ్మో.. అక్కా.. అది పామునుకున్నావా.?  పొట్లకాయనుకున్నావా..?
Woman Caught Snake
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 12, 2023 | 8:27 PM

సాధారణంగా ఆడవాళ్లు చిన్నొ బొద్దింకను చూస్తే వామ్మో అని గట్టిగా అరుస్తూ అంతెత్తు ఎగురుతారు. అలాంటి ఏకంగా పాము కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా?! పైప్రాణాలు పైకే. కానీ, ఇక్కడ ఓ మహిళ మాత్రం అత్యంత ప్రమాకరమైన, విషపూరితమైన పామును అదేదో పొట్లకాయ మాదిరిగా, ఏమాత్రం భయం బెరుకు లేకుండా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి అమ్మ బాబోయ్.. అంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంట్లో కారు పార్క్ చేసి ఉంది. అయితే, ఆ ఇంట్లోని అమ్మాయి కారులో బయలుదేరేందుకు సిద్ధమైంది. కారు కూడా ఎక్కేసింది. అయితే, ఆ కారు ఎంతటీ స్టార్ట్ అవడం లేదు. పైగా కారు ఇంజిన్ నుంచి వింత వింత శబ్దాలు రావడం ప్రారంభమైంది. ఏంటా అని బానెట్ ఓపెన్ చేసి చూసింది ఆ అమ్మాయి. ఇంకేముంది.. ఫ్యూజుల్ ఔట్. ఒక్కసారిగా భారీ పాము కనిపించడంతో అమ్మా.. అని అరుస్తూ ఇంట్లోకి లగెత్తుకెళ్లింది. విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి వాళ్ల అమ్మ.. ఏమాత్రం భయపడకుండా చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని వచ్చింది. కారు ఇంజిన్ భాగంలో దాక్కున్న పామును ఎంతో చాకచక్యంగా బయటకు తీసింది. దాని తోకను పట్టుకుని బయటకు లాగింది. చాలా పొడవుగా ఉన్న ఈపాము చాలా డేంజర్. విషపూరితమైనది. ఇది కరిస్తే ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆమె ఏమాత్రం కంగారుపడలేదు, భయపడలేదు. ఆ పామును కారు ఇంజిన్ నుంచి బయటకు తీసి.. నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టింది.

కాగా, మహిళ కారు ఇంజిన్‌లోంచి పామును తీసిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అమ్మ బాబోయ్ అంటూ అవాక్కవుతున్నారు నెటిజన్లు. అక్కా.. అదేమైనా పాము అనుకున్నవా, పొట్లకాయ అనుకున్నవా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా.. బొద్దింకను చూసి జడుసుకునే ఈ కాలంలో.. ఏకంగా అత్యంత ప్రమాకరమైన పామను సునాయాసంగా పట్టుకున్న ఆమెకు సలామ్ అంటున్నారు సోషల్ మీడియా యూజర్లు. మరెందుకు ఆలస్యం.. ఆమె ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

(FOX 26 Houston సౌజన్యంతో)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..