Tech Tips: ఛార్జింగ్‌ పెట్టి స్విచ్ఛ్‌ ఆన్‌ చేయడం మర్చిపోతున్నారా.? మీకోసమే ఈ టెక్నిక్‌.

స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారికి బ్యాటరీనే ప్రధాన సమస్య. ఫోన్‌లో ఉండే రకరకాల యాప్స్‌ కారణంగా ఛార్జింగ్‌ త్వరగా డిశ్చార్జ్‌ అవుతుంది. దీంతో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే వెంటనే ఫోన్‌ ఛార్జింగ్ చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్లబ్‌లో ఛార్జర్‌ను పెడుతాం కానీ...

Tech Tips: ఛార్జింగ్‌ పెట్టి స్విచ్ఛ్‌ ఆన్‌ చేయడం మర్చిపోతున్నారా.? మీకోసమే ఈ టెక్నిక్‌.
Smartphone
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 14, 2023 | 4:34 PM

స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారికి బ్యాటరీనే ప్రధాన సమస్య. ఫోన్‌లో ఉండే రకరకాల యాప్స్‌ కారణంగా ఛార్జింగ్‌ త్వరగా డిశ్చార్జ్‌ అవుతుంది. దీంతో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే వెంటనే ఫోన్‌ ఛార్జింగ్ చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్లబ్‌లో ఛార్జర్‌ను పెడుతాం కానీ హడావుడిలో స్విఛ్‌ ఆన్‌ చేయడం మర్చిపోతుంటాం. తీరా గంట తర్వాత ఛార్జింగ్‌ అయ్యుంటందని ఫోన్‌ చూసేసరికి స్విఛ్‌ ఆన్‌ చేయలేదనే విషయాన్ని గమనించి కంగుతింటారు.

మనలో చాలా మందికి ఇలాంటి పరిస్థితే ఎదురై ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఇలాంటి పొరపాటునే చేసి ఉంటాం. అయితే సాధారణంగా ఫోన్‌ని చార్జర్‌కు కనెక్ట్‌ చేసి స్విఛ్‌ ఆన్‌ చేసిన సమయంలో బ్లింక్‌ అవ్వడమే, చిన్నగా సౌండ్‌ వస్తుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అలర్ట్‌ను కూడా పెడచెవిన పెడుతుంటాము. అందుకే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అయితే దీనికి కూడా ఓ సొల్యుషన్‌ ఉందని మీకు తెలుసా.? ప్లేస్టోర్‌ నుంచి ఓ చిన్న యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఛార్జింగ్ చేసే సమయంలో వాయిస్‌ అలర్ట్‌ వచ్చేలా సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా ఫోన్‌లో రికార్డింగ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి మీకు నచ్చిన వాయిస్‌ని రికార్డ్ చేసుకోవాలి. అనంతరం గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి.. ‘బ్యాటరీ సౌండ్ నోటిఫికేషన్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తర్వాత యాప్‌ను ఓపెన్‌ చేసి పైన కనిపించే ‘+’ బటన్‌ను నొక్కాలి. తర్వాత ‘మోడ్‌’లో కనెక్టడ్‌ ఆప్షన్‌ను ఎంచుకొని.. ఛార్జర్‌ కనెక్ట్ చేసిన సమయంలో ఏ వాయిస్‌ కమాండ్ రావాలో దానిని సెలక్ట్ చేసుకోవాలి. అలాగే ‘డిస్‌కనెక్ట్‌’, ‘ఫుల్ బ్యాటరీ’, ‘లో బ్యాటరీ’ ఇలా ఆప్షన్స్‌కి అనుగుణంగా ఆడియో క్లిప్స్‌ని ఎంచుకొని సేవ్‌ చేయాలి. చివరిగా పవర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!