Boult Rover Pro: బౌల్ట్ నుంచి మరో కొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ చూశారంటే మతిపోతుందంతే..
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వాటితో పాటు స్మార్ట్ యాక్ససరీస్‌లను వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. కంపెనీలు కూడా యువతను ఆకట్టుకోవడానికి కొత్త వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. యువతను ఈ మధ్య కాలంలో తమ స్మార్ట్ వాచ్‌లతో ఎక్కువగా ఎక్కువగా ఆకర్షిస్తున్న బౌల్ట్ కంపెనీ మరో కొత్త వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బౌల్ట్ రోవర్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా యువతను ఆకట్టుకుందని కంపెనీ […]
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వాటితో పాటు స్మార్ట్ యాక్ససరీస్‌లను వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. కంపెనీలు కూడా యువతను ఆకట్టుకోవడానికి కొత్త వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. యువతను ఈ మధ్య కాలంలో తమ స్మార్ట్ వాచ్‌లతో ఎక్కువగా ఎక్కువగా ఆకర్షిస్తున్న బౌల్ట్ కంపెనీ మరో కొత్త వాచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బౌల్ట్ రోవర్ ప్రో పేరుతో రిలీజ్ చేసిన ఈ వాచ్ కచ్చితంగా యువతను ఆకట్టుకుందని కంపెనీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ వాచ్ డిజైన్ కూడా మామూలు స్మార్ట్ వాచ్‌ల్లా కాకుండా కొంచెం కొత్తగా ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటుననాయి. ఈ వాచ్ కుడి వైపున రెండు భౌతిక బటన్‌లతో వృత్తాకార డయల్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ వాచ్ ఐపీ 68 సర్టిఫైడ్ వాటర్ డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 466×466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ ఫ్లిప్ కార్ట్‌లో రూ.2499కు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఈ వాచ్‌ను లాంచ్ ఆఫర్‌లో కొనుగోలు చేస్తే రెండు స్ట్రిప్స్ అదనంగా కంపెనీ అందిస్తుంది. ఈ వాచ్‌కు సంబంధించిన అదనపు ఫీచర్లు ఏంటో ఓ లుక్కేద్దాం.
ఆరోగ్య పరంగా బౌల్ట్ రోవర్ ప్రోలో హార్ట్ రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 సెన్సార్, స్లీప్ ట్రాకర్, ఆడవారి కోసం రుతుచక్రం మానిటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌లో ముఖ్యంగా హైడ్రేషన్, సెడెంటరీ రిమైండర్‌లు ఉంటాయి. అలాగే 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్ ప్రత్యేకత. బౌల్ట్ రోవర్ ప్రో హ్యాండ్స్ ఫ్రీ బ్లూటూత్ కాలింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ మద్దతుతో వస్తుంది. అలాగే అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్లు కూడా ఉంటాయి. క్యూఆర్ కోడ్, నాలుగు అంకెల పిన్ ద్వారా సైన్-ఇన్ చేసే పద్ధతి ఆకట్టుకుంటుంది. అలాగే అంతర్నిర్మిత మినీ గేమ్‌లు, వాతావరణ అప్‌డేట్స్, స్మార్ట్ నోటిఫికేషన్లు, ఫైండ్ మై ఫోన్, ఎస్ఓఎస్ ఎమర్జెన్సీ అలర్ట్‌లు వంటవి ఈ ఫోన్ ప్రత్యేకతలు ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను ఓ సారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు ఏడు రోజుల వరకూ పని చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..