Xiaomi Hair Trimmers: ఎంఐ నుంచి మరో రెండు కొత్త ట్రిమ్మర్లు.. ధర ఎంతో తెలుసా?
ఇటీవల ఎంఐ కంపెనీ నిర్వహించిన స్మార్టర్ లివింగ్ ఈవెంట్‌లో కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రకటించింది. కొత్త రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు,స్మార్ట్ టీవీలతో పాటు, కంపెనీ తన తాజా శ్రేణి ట్రిమ్మర్‌లను ప్రకటించింది.
స్మార్ట్ ఫోన్లతో భారతదేశ ప్రజలు మనస్సును దోచుకున్న ఎంఐ కంపెనీ తాజాగా వివిధ గృహోపకరణాలను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే టీవీలను రిలీజ్ చేసిన ఈ కంపెనీ వినియోగదారుల ఆదరణను అందుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎంఐ ప్రొడెక్ట్స్‌ను ఎక్కువగా వాడుతన్నారు. అలాగే యువతను ఆకట్టుకోవడానికి బ్లూటూత్, స్మార్ట్ వాచ్ వంటివి రిలీజ్ చేసిన కంపెనీ గతంలో ట్రిమ్మర్లను కూడా రిలీజ్ చేసింది. ట్రిమ్మర్లు కూడా అత్యంత ఆదరణ పొందిన వాటికి కొనసాగింపుగా ఎలాంటి ట్రిమ్మర్లను కంపెనీ రిలీజ్ చేయలేదు. అయితే ఇటీవల ఎంఐ కంపెనీ నిర్వహించిన స్మార్టర్ లివింగ్ ఈవెంట్‌లో కొత్త ఉత్పత్తుల శ్రేణిని ప్రకటించింది. కొత్త రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు,స్మార్ట్ టీవీలతో పాటు, కంపెనీ తన తాజా శ్రేణి ట్రిమ్మర్‌లను ప్రకటించింది. ఎంఐ గ్రూమింగ్ కిట్, ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 2 సీ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. మెరుగైన ట్రిమ్మింగ్ ఫీచర్లతో పాటు సొగసైన ఎర్గోనామిక్ డిజైన్ వీటి ప్రత్యేకత. ఈ రెండు ప్రొడెక్ట్స్ గురించి అదనపు ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఎంఐ గ్రూమింగ్ కిట్, ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 2 సీ ప్రత్యేకతలు ఇవే
కొత్తగా ప్రారంభించిన గ్రూమింగ్ కిట్‌లో ప్రామాణిక యూ ఆకారపు బ్లేడ్‌తో వస్తుంది. 0.5 ఎంఎం కచ్చితత్వంతో షేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్‌లతో వచ్చే మెరుగైన గ్రిప్‌ను వినియోగదారుడికి అందిస్తుంది. దీంతో మెరుగైన సేవింగ్ అనుభూతిని పొందుతారు. ఈ కిట్‌లో 20 మిమీ వరకు అనుమతించే కోంబ్ సెట్టింగ్స్ ఉన్నాయి. ముక్కు, చెవి, బాడీ గ్రూమింగ్ హెడ్, ప్రెసిషన్ బ్లేడ్‌లు ఈ గ్రూమింగ్ కిట్ ప్రత్యేకతలు. ఈ గ్రూమింగ్ కిట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఐదు నిమిషాల చార్జింగ్‌తో పది నిమిషాల రన్ టైమ్ వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 2 సీ కూడా 90 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తుంది. అలాగే మెరుగైన గ్రిప్ కారణంగా వినియోగదారుడు మంచి ట్రిమ్మింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందుతాడు.
ధర, లభ్యత
ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 2 సీ ధర రూ.1199గా కంపెనీ నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.1099కే వినియోగదారుడికి అందిస్తారు. అలాగే ఎంఐ గ్రూమింగ్ కిట్ ధర రూ.1799గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.1699కే వినియోగదారుడి అందుతుంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ రెండు ట్రిమ్మర్లు ఏప్రిల్ 16 నుంచి అందుబాటులో ఉంటాయని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..