Amazon Offers: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. రూ.74999 విలువైన సామ్‌సంగ్ ఎస్ 20 ఎఫ్ఈ కేవలం రూ.9999కే…
విడుదలైన నాటి నుంచి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న సామ్‌సంగ్ ఎస్ 20 ఎఫ్ఈ ఫోన్స్‌పై ఓ అమెజాన్‌లో ఓ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.74999 విలువైన ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం భారత మార్కెట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. మొదట్లో ఫోన్లు అందరూ ఆఫ్ లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయగా క్రమేపి ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడైతే భారత్‌లో అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్స్‌లో సింహభాగం షాపింగ్ సైట్స్ నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో బ్యాంకు ఆఫర్లు, అలాగే పాత ఫోన్స్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉండడంతో ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో మొబైల్స్ కొనుగోలు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ సైట్ అమెజాన్‌లో ఉన్న ఓ ఆఫర్ గురించి తెలుసుకుందాం. విడుదలైన నాటి నుంచి వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్న సామ్‌సంగ్ ఎస్ 20 ఎఫ్ఈ ఫోన్స్‌పై ఓ అమెజాన్‌లో ఓ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.74999 విలువైన ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.9999 కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో బ్యాంకు ఆఫర్ కలిస్తే ఈ ఫోన్ కేవలం రూ.9999కే వినియోగదారుల చేతికి అందుతుంది. ప్రస్తుతం ఈ ఫోన్ భారీ తగ్గింపుతో కేవలం రూ.34999కే అందుబాటులో ఉంది. అలాగే బ్యాంకు కార్డ్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు ఆఫర్లు ఎలా పొందాలో? ఓ సారి తెలుసుకుందాం.
స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ 8 జీబీ+ 128 జీబీ వేరియంట్లో లభిస్తుంది. ముఖ్యంగా క్లౌడ్ నేవి కలర్‌లో ఉన్న ఫోన్ అమెజాన్‌లో 53 శాతం తగ్గింపుతో లభిస్తుంది. దీంతో ఫోన్ రూ.34999కు అందుబాటులో ఉంది. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.25000 వరకూ తగ్గింపు లభిస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్, గరిష్ట డిస్కౌంట్ పొందితే ఈ ఫోన్ రూ.9999కే మీ చేతికి వస్తుంది. అలాగే హెచ్ఎస్‌బీసీ కార్డులపై రూ.2000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అయితే మీకు వచ్చే ఎక్స్చేంజ్ ఆఫర్ మీ ఎక్స్చేంజ్ చేసే ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..