‘సెలూన్లు లేవు.. అందుకే డాడీకి ట్రిమ్మింగ్’.. ఓ మంత్రి కుమారుడి సేవ !

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ.. షాపులు, సెలూన్లు అన్నీ బంద్! మరి.. ఏం చేయాలి ? అందుకే ఓ కేంద్ర మంత్రి కుమారుడు తన తండ్రికి ఎలెక్రిక్ ట్రిమ్మర్ తో ఆయన గడ్డాన్ని అందంగా ట్రిమ్ చేశారు.

'సెలూన్లు లేవు.. అందుకే డాడీకి ట్రిమ్మింగ్'.. ఓ మంత్రి కుమారుడి సేవ !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 12, 2020 | 8:34 PM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ.. షాపులు, సెలూన్లు అన్నీ బంద్! మరి.. ఏం చేయాలి ? అందుకే ఓ కేంద్ర మంత్రి కుమారుడు తన తండ్రికి ఎలెక్రిక్ ట్రిమ్మర్ తో ఆయన గడ్డాన్ని అందంగా ట్రిమ్ చేశారు. ఆయనే చిరాగ్ పాశ్వాన్.. సెంట్రల్ మినిస్టర్ రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడైన ఈయన ఆదివారం తన డాడీ గడ్డాన్ని ట్రిమ్ చేస్తూ.. ఆ వీడియోను రిలీజ్ చేశారు. ‘ఇలాంటి జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోతాయి.’ లాక్ డౌన్ సమయంలో ఈ విధంగానైనా డాడీకి సేవ చేసే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అన్నారు చిరాగ్ పాశ్వాన్.. ఈ వీడియోను చూసిన ట్విటర్ యూజర్లు.. ‘మీ లాంటి తనయుడు ఉన్నందుకు మీ తండ్రి ఎంతో సంతోషిస్తారు.. వండర్ ఫుల్’ అంటూ ప్రశంసించారు.