ప్రధాని షేర్ చేసిన వీడియో చూసి.. మండిపడుతున్న నెటిజన్లు..!
జపాన్ ప్రధాని షింజో అబే.. ఓ వీడియో షేర్ చేసి.. నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో తన ఇంట్లో ఆయన కాలక్షేపం చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో అది కాస్త నెటిజన్ల విమర్శలకు తావిచ్చింది.ఓ దేశం అల్లకల్లోలం అవుతుంటే.. మీరు ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారా అంటూ విమర్శలు గుప్పించారు. అతను ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో..ఓ కుక్క పిల్లతో ఆడుకుంటూ.. […]
జపాన్ ప్రధాని షింజో అబే.. ఓ వీడియో షేర్ చేసి.. నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్ ఉన్న నేపథ్యంలో తన ఇంట్లో ఆయన కాలక్షేపం చేస్తున్న వీడియో పోస్ట్ చేయడంతో అది కాస్త నెటిజన్ల విమర్శలకు తావిచ్చింది.ఓ దేశం అల్లకల్లోలం అవుతుంటే.. మీరు ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారా అంటూ విమర్శలు గుప్పించారు. అతను ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో..ఓ కుక్క పిల్లతో ఆడుకుంటూ.. టీ తాగుతూ..షింజో అబే ఆ వీడియోలో చాలా ప్రశాంతంగా ఉన్నారు.
దీంతో నెటిజన్లు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్వీట్లు చేశారు. ప్రజలు ఓ వైపు కరోనాతో భయబ్రాంతులకు గురవుతుంటే.. మీరు ఇలాగా రాయల్ లైఫ్ అనుభవిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఆయన కూడా తన వ్యక్తిగత జీవితాన్ని అనుభవించాలి కదా అంటూ సపోర్టుగా నిలుస్తున్నారు.