Lovers: ప్రేమికులకు బిగ్ షాక్.. ఆ పార్కులో కొత్త రూల్స్.. పాటించలేదో అంతే సంగతులు..

కర్ణాటక రాజధాని బెంగళూరులో కుబ్బన్ పార్క్ చాలా ఫేమస్. యువతీ, యువకులు ఎవరిని అడిగినా ఈ పార్క్ గురించి చెబుతారు. ఈ పార్క్ ప్రేమికులకు చాలా ప్రత్యేకమైంది. అయితే, ఆ పార్క్‌కు వచ్చే జంటలకు బిగ్ షాక్ ఇచ్చారు అధికారులు. ముఖ్యంగా ప్రేమ జంటలనుద్దేశించి కీలక నిబంధనలు విధించారు.

Lovers: ప్రేమికులకు బిగ్ షాక్.. ఆ పార్కులో కొత్త రూల్స్.. పాటించలేదో అంతే సంగతులు..
Cubbon Park
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 13, 2023 | 7:25 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో కుబ్బన్ పార్క్ చాలా ఫేమస్. యువతీ, యువకులు ఎవరిని అడిగినా ఈ పార్క్ గురించి చెబుతారు. ఈ పార్క్ ప్రేమికులకు చాలా ప్రత్యేకమైంది. అయితే, ఆ పార్క్‌కు వచ్చే జంటలకు బిగ్ షాక్ ఇచ్చారు అధికారులు. ముఖ్యంగా ప్రేమ జంటలనుద్దేశించి కీలక నిబంధనలు విధించారు. ఆ నిబంధనలను చూసి ప్రేమ జంటలు ఉసూరుమంటున్నారు. మరి ఇంతకీ అధికారులు ఏ నిబంధనలు విధించారు? వివరాలు చూద్దాం..

కుబ్బన్ పార్క్‌కు వచ్చే కపుల్స్ కాస్త మంచి ప్రవర్తనతో మెలగాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ప్రేమికులు, యువతీ, యువకులు జంటగా దగ్గరగా ఉండొద్దని నిబంధన పెట్టారు. ప్రేమ జంటలు దగ్గరగా ఉండి ఫోటోలు, వీడియోలు తీసుకోవద్దని నిషేధాజ్ఞలు విధించారు. పార్కులో ప్రేమ జంటలు చేసే పనులతో ఫ్యామిలీ పర్సన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశంపై పార్క్ నిర్వాహకులకు అనేకసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. చర్యలు చేపట్టారు అధికారులు. పార్క్‌లో చిల్లర వేషాలు వేయొద్దని, బయటి నుంచి ఆహారం తీసుకురావొద్దని స్పష్టం చేశారు. ప్రేమ జంటలు అసభ్యంగా ప్రవర్తించొద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు పార్క్ సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్ల ద్వారా అనౌన్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..