Bihar Robbery: పట్టపగలే భారీ చోరీ.. బ్యాంకులో కాల్పుల మోత.. సీసీ టీవీ విజువల్స్..
బిహార్ చప్రా జిల్లా సోనెపూర్‌లో ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రాబరీకి తెగబడ్డారు దోపిడీ దొంగలు. బ్యాంకులోకి ప్రవేశించిన 5గురు దుండగులు తుపాకులతో ఇద్దరు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. 5 రౌండ్ల కాల్పులు జరపగా ఒక హోంగార్డుకు తలలో బుల్లట్ దూసుకుపోవడంతో

బిహార్ చప్రా జిల్లా సోనెపూర్‌లో ఓ బ్యాంకులో దోపిడీ జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రాబరీకి తెగబడ్డారు దోపిడీ దొంగలు. బ్యాంకులోకి ప్రవేశించిన 5గురు దుండగులు తుపాకులతో ఇద్దరు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. 5 రౌండ్ల కాల్పులు జరపగా ఒక హోంగార్డుకు తలలో బుల్లెట్ దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, ఇంకో భద్రతా సిబ్బంది కడుపులో కి బుల్లెట్ దిగడంతో అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస దోపిడీలతో బిహార్ లో బ్యాంకుల సిబ్బంది బెంబేలెత్తి పోతున్నారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సమయంలో ఐదుగురు దొంగలు హెల్మెట్ , ముసుగులు ధరించి కస్టమర్లలా బ్యాంకులోకి ప్రవేశించారు. తుపాకులు బైటికి తీసి అక్కడి వారిని బెదిరించి దోచుకోవడానికి యత్నించారు. దొంగలను చూసిన వెంటనే ఇద్దరు భద్రతా సిబ్బంది వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వారిపై దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం 5 రౌండ్ల కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి బ్యాంకు ఉద్యోగి పూజ కుమారి తెలిపారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




