Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. అవినాష్‌ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు. అసలేం జరగనుంది?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్‌ రెడ్డిని విచరించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయమే అధికారులు అవినాష్‌ నివాసానికి చేరుకున్నారు. మొత్తం రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ అవినాష్‌...

Andhra Pradesh: వివేకా హత్య కేసులో కీలక మలుపు.. అవినాష్‌ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు. అసలేం జరగనుంది?
Avinash Reddy
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 16, 2023 | 6:34 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్‌ రెడ్డిని విచరించనున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయమే అధికారులు అవినాష్‌ నివాసానికి చేరుకున్నారు. మొత్తం రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ అవినాష్‌ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇప్పటికే 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితమే అవినాష్‌ అనుచరుడు ఉదయ్‌ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అనివాష్‌ విచారణ సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది. ఏం జరగనుందన్న దానిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అవినాష్‌ను అధికారులు ఏం అడగనున్నారు.? అన్నదానిపై ఆసక్తినెలకొంది. ఇక ఉదయ్‌ రెడ్డి విచారణలో భాగంగా అతని ఫోన్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు సీబీఐ రిపోర్ట్‌లో వెల్లడించారు.

వివేకానందారెడ్డి మర్డర్‌కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. వెంటనే మాసబ్‌ట్యాంక్‌లోని జడ్జి ఇంటి నుంచి ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

ఇక వైఎస్‌. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్‌ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్‌ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. వివేకా హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్‌కి సంబంధించిన వివరాలు ఉండడంతో సీబీఐ ఆయన్ని అదుపులోకి తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..