Automobile: కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? రూ. 7 లక్షల లోపే సెవన్ సీటర్ కార్స్.. వివరాలివే..
కరోనా మహమ్మారి తరువాత ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రావాణా విషయంలో తమ సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమకంటూ ఒక కారు ఉంటే బాగుంటుందని భావించి, కార్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే కరోనా సమయంలోనూ కార్ల అమ్మకాలు భారీగా జరిగాయి.
కరోనా మహమ్మారి తరువాత ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రావాణా విషయంలో తమ సొంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తమకంటూ ఒక కారు ఉంటే బాగుంటుందని భావించి, కార్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే కరోనా సమయంలోనూ కార్ల అమ్మకాలు భారీగా జరిగాయి. ఇప్పటికీ కార్ల విక్రయాల జోరు తగ్గలేదు. మీరు కూడా కొత్తగా సెవెన్ సీటర్ కానును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అది కూడా బడ్జెట్ ధరకే ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసమే తక్కువ ధరకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సెవెన్ సీటర్ కార్స్ వివరాలు అందిస్తున్నాం.
మారుతీ సుజుకి ఈకో..
భారతదేశంలోనే అత్యంత చవకైన 7-సీటర్ కారు. ఇది పెట్రోల్, CNG ఆప్షన్స్‌తో వస్తుంది. ఇది 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 81 బిహెచ్‌పి పవర్, 104 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.25 లక్షల నుంచి రూ.6.51 లక్షల మధ్య ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్..
రెనాల్ట్ ట్రైబర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ MPV. ఇది 1.0-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 71 బిహెచ్‌పి పవర్, 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.33 లక్షల నుండి రూ. 8.97 లక్షల మధ్య ఉంది.
మారుతీ సుజుకి ఎర్టిగా..
మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న MPV. ఇది 99 bhp పవర్, 136.8 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.35 లక్షల నుంచి రూ.12.79 లక్షల మధ్య ఉంటుంది.
కియా కేరెన్స్..
Kia Carens 113 bhp పవర్‌తో 1.5-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 158 bhp పవర్‌తో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 114 bhp శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.45 లక్షల నుంచి రూ.18.95 లక్షల మధ్య ఉంటుంది.
మహీంద్రా బొలెరో నియో..
మహీంద్రా బొలెరో నియో 1.5-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో ఉంది. ఇది 98 bhp పవర్, 260 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.9.63 లక్షల నుండి రూ.12.14 లక్షల మధ్య ఉంది.
మరిన్ని ఆటోమొబైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..