AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Features: వాట్సాప్ యూజర్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ఇక ఆ టెన్షన్ అవసరమే లేదు..

మేటా యాజమాన్యంలోని వాట్సాప్.. తన యూజర్ల భద్రత కోసం నిత్యం అనేక రకాల చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గతేడాది అనేక ఫీచర్స్‌ని తీసుకువచ్చిన వాట్సాప్.. ఈ ఏడాది కూడా ఆ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా వాట్సాప్ యూజర్ల గోప్యత, భద్రతకు సంబంధించి సరికొత్తగా 3 ఫీచర్లను తీసుకువచ్చింది.

WhatsApp Features: వాట్సాప్ యూజర్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ఇక ఆ టెన్షన్ అవసరమే లేదు..
Whatsapp
Shiva Prajapati
|

Updated on: Apr 15, 2023 | 6:58 PM

Share

మేటా యాజమాన్యంలోని వాట్సాప్.. తన యూజర్ల భద్రత కోసం నిత్యం అనేక రకాల చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గతేడాది అనేక ఫీచర్స్‌ని తీసుకువచ్చిన వాట్సాప్.. ఈ ఏడాది కూడా ఆ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా వాట్సాప్ యూజర్ల గోప్యత, భద్రతకు సంబంధించి సరికొత్తగా 3 ఫీచర్లను తీసుకువచ్చింది. అకౌంట్ ప్రొటెక్ట్, డివైజ్ వేరిఫికేషన్, ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్ అనే మూడు ఫీచర్లను తీసుకువచ్చింది.

ఈ మూడు ఫీచర్స్ యూజర్ల భద్రతను, ప్రైవసీని కాపాడుతాయని మెటా పేర్కొంది. ఈ ఫీచర్స్ లో ముందుగా అకౌంట్ ప్రొటెక్ట్ ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. అకౌంట్ ప్రొటెక్ట్ ఫీచర్ యాక్సెప్ట్ చేస్తే.. కొత్త డివైజ్‌కు వాట్సాప్‌ను మార్చుకునేటప్పుడు పాత డివైజ్‌లో అనుమతి ఇవ్వడం తప్పనిసరి. ఇక మన ప్రమేయం లేకుండా మన ఫోన్‌లో మాల్‌వేర్‌ ద్వారా వాట్సాప్‌ నుంచి అనవసర మెసేజ్‌లు వెళ్తున్నాయా అన్నది గుర్తించడానికి ‘డివైజ్‌ వెరిఫికేషన్‌’ ఫీచర్‌ గుర్తిస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా హ్యాకర్స్ కనెక్షన్‌ను బ్లాక్‌ చేయడానికి వీలు ఉంటుంది. వాట్సాప్‌లో మనం పంపే మెసేజ్‌లు సేఫ్‌గా అవతలివారికి వెళ్తున్నాయా? లేక ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా? అనేది గుర్తించడానికి ఆటోమెటిక్‌ సెక్యూరిటీ కోడ్స్‌ ఫీచర్‌ పని చేస్తుంది.

ఈ కొత్త ఫీచర్స్‌తో వాట్సాప్ యూజర్ల భద్రత మరింత పటిష్టం అవుతుందని మేటా యాజమాన్యం పేర్కొంది. వాట్సాప్ అప్‌డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్స్‌ను పొందుతారని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!