AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: భయపెడుతున్న బంగారం.. ముందు ముందు పసిడి ధరలు ఇలా ఉండనున్నాయి..!

అతివల మదిని దోచే ఆభరణాలు స్వర్ణకాంతులే! కానీ.. ఆ స్వర్ణం ఇప్పుడు కొనే స్థితిలో లేకుండా పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది పసిడి ధర. అక్షయ తృతియ వేళ పసిడి కొనాలని మగువుల సెంటిమెంట్‌! కానీ.. బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అయితే..

Gold Price: భయపెడుతున్న బంగారం.. ముందు ముందు పసిడి ధరలు ఇలా ఉండనున్నాయి..!
Gold Price
Shiva Prajapati
|

Updated on: Apr 15, 2023 | 10:20 PM

Share

అతివల మదిని దోచే ఆభరణాలు స్వర్ణకాంతులే! కానీ.. ఆ స్వర్ణం ఇప్పుడు కొనే స్థితిలో లేకుండా పరుగులు పెడుతోంది. ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది పసిడి ధర. అక్షయ తృతియ వేళ పసిడి కొనాలని మగువుల సెంటిమెంట్‌! కానీ.. బంగారం ధర రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అయితే.. ఈ అక్షయ తృతియలో ధరలు తగ్గే అవకాశం ఉందా? పసిడి పరుగులకు ఎప్పుడు బ్రేక్‌ పడుతుంది? అసలు.. గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ పరిస్థితి ఏంటి?

అక్షయ తృతీయ వేళ.. గోల్డెన్‌ ఫియర్స్‌ బెంబేలెత్తిస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్న బంగారం ధరలు వినియోగదారుల్ని వణికిపుట్టిస్తున్నాయి. ఇప్పుడు మండుతున్న బంగారం ధరల్ని చూస్తే కొనుగోలుదారుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. ప్రతిరోజూ కనీసం ఎంతో కొంత పెరుగుతూ ఆకాశమే హద్దు అనేంతగా దూకుడు మీదుంది. బంగారం కొనేందుకు భయపడుతున్నామని, బంగారం మీద మక్కువను చంపుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అక్షయ తృతీయ నాటికి ఇంకెంత పైకి ఎగబాకుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకీ దూకుడు?

దేశంలో బంగారం ధర భారీగా పెరగడానికి చాలానే కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్‌ ఏర్పడడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. అలాగే.. డాలర్‌, బాండ్ల సూచీల క్షీణత కారణంగా బంగారం కొనుగోలుకు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి.

ఇవి కూడా చదవండి

గత పదిరోజుల్లో హైదరాబాద్‌లో బంగారం ధరల్ని పరిశీలిస్తే పెరుగుదల ఎంత జరిగిందో అర్థమవుతుంది. క్రమంగా బంగారం ధర పెరుగుతునే వస్తోంది. గత పదిరోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 15 ఏప్రిల్‌ – 61,040 14 ఏప్రిల్‌ – 61,800 13 ఏప్రిల్‌ – 61.200 12 ఏప్రిల్‌ – 61,310 11 ఏప్రిల్‌ – 60,760 10 ఏప్రిల్‌ – 60,430 9 ఏప్రిల్‌ – 60,860 8 ఏప్రిల్‌ – 60,870 7 ఏప్రిల్‌ – 60,870 6 ఏప్రిల్‌ – 60,980

ఏడేళ్ల వెనక్కెళ్తే ఇటువంటి సర్‌ప్రైజెస్ చాలానే కనిపిస్తాయ్. బంగారం ధరల్ని పరిశీలిస్తే పెరుగుదల ఎంత ర్యాపిడ్‌గా జరిగిందో అర్థమవుతుంది. రెండేళ్ల కిందట ఏడాది పాటు స్థిమితంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాతే వేగం పుంజుకుంది. అంతకుముందయితే.. ఏటా సగటున రూ. 3 వేల చొప్పున పెరుగుతూనే ఉంది.

ఏడేళ్ల బంగారం ధరలు..

– నెల రోజుల కిందట.. రూ. 60,000

– రెండు రోజుల కిందట.. రూ. 56,572

– ఏడాది కిందట.. రూ. 53,052

– రెండేళ్ల కిందట.. రూ. 50,982

– మూడేళ్ల కిందట.. రూ. 50,683

– నాలుగేళ్ల కిందట.. రూ. 47,901

– ఐదేళ్ల కిందట.. రూ. 44,995

– ఆరేళ్ల కిందట.. రూ. 42,752

– ఏడేళ్ల కిందట.. రూ. 41,303

ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉంది ప్రపంచం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో హెడ్జింగ్ టూల్‌గా పనికొచ్చేది బంగారమే. కావున, బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. పైగా.. అక్షయ తృతీయ నాటికి ధర ఇంకా పెరగొచ్చు. ఏదేమైనా.. రాబోయే రోజుల్లో బంగారం కొనేవాళ్లకు పెనుభారం తప్పదన్నది క్లియర్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..