Bengaluru: బర్త్‌డే సెలబ్రేషన్‌లో ప్రియురాలికి చావును గిఫ్ట్‌గా ఇచ్చిన సైకో లవర్.. కేక్ కట్ చేసిన కత్తితోనే..

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. అని పాడుకోవడం.. వీలైతే నాలుగు బీరు సీసాల్ని ఖాళీ చెయ్యడం.. అక్కడితోనే బ్రేకప్ కథల్ని ముగించే ప్రేమికుల్ని చూసుంటాం. కానీ, ఈ ప్రేమికుడు కాస్త సైకో.. మామూలు సైకో కాదండోయ్.. అంతకుమించి. బర్త్‌డే సెలబ్రేషన్‌లోనే ప్రియురాలికి చావును గిఫ్టుగా ఇచ్చి లెట్స్ ఎంజాయ్ అనేశాడు. టోటల్‌ బెంగుళూరునే వణికిస్తోంది.. ఈ అపర ప్రేమికుడి లవ్‌ అండ్ బ్రేకప్ స్టోరీ.

Bengaluru: బర్త్‌డే సెలబ్రేషన్‌లో ప్రియురాలికి చావును గిఫ్ట్‌గా ఇచ్చిన సైకో లవర్.. కేక్ కట్ చేసిన కత్తితోనే..
Bengaluru Lovers
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 18, 2023 | 8:26 PM

ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. అని పాడుకోవడం.. వీలైతే నాలుగు బీరు సీసాల్ని ఖాళీ చెయ్యడం.. అక్కడితోనే బ్రేకప్ కథల్ని ముగించే ప్రేమికుల్ని చూసుంటాం. కానీ, ఈ ప్రేమికుడు కాస్త సైకో.. మామూలు సైకో కాదండోయ్.. అంతకుమించి. బర్త్‌డే సెలబ్రేషన్‌లోనే ప్రియురాలికి చావును గిఫ్టుగా ఇచ్చి లెట్స్ ఎంజాయ్ అనేశాడు. టోటల్‌ బెంగుళూరునే వణికిస్తోంది.. ఈ అపర ప్రేమికుడి లవ్‌ అండ్ బ్రేకప్ స్టోరీ.

మరో చరిత్రకు తక్కువ.. రక్తచరిత్రకు ఎక్కువ..

కలర్‌ఫుల్ బెలూన్లు, డెకరేషన్లు, లెట్స్ పార్టీ అంటూ జోష్‌ఫుల్ సాంగ్స్. అందరి బర్త్‌డేల్లాగే ఆమె బర్త్‌డే సెలబ్రేషన్ కూడా అదరహో రేంజ్‌లో జరిగింది. చీఫ్ గెస్ట్ ఎవరంటే మెచ్చిన ప్రియుడు. ఆ మాటకొస్తే.. ఈ జోష్‌కంతా హోస్ట్ అతడే. కానీ, ఇక్కడే ఊహకందని ఒక ఘోరమైన ట్విస్ట్. ఆ బర్త్‌డేనే ఆమెకు డెత్‌డే అయ్యింది. అంతకంటే స్పెషల్ ఏంటంటే.. చంపిన హంతకుడు ఆమె ప్రియుడే కావడం. ఇంతకంటే స్పెషల్.. ఆయుధం ఆ బర్త్‌డే కేక్ కట్‌చేసిన కత్తి.

ఈ రొమాంటిక్ క్రైమ్ కథాచిత్రం బెంగుళూరులో జరిగింది. మృతురాలు 24 ఏళ్ల నవ్య. కర్నాటక పోలీస్ డిపార్ట్‌మెంట్‌. ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్‌లో క్లర్కుగా పనిచేసేది. నిందితుడు కనకపురాకు చెందిన ప్రశాంత్. ఇద్దరూ లవ్‌బర్డ్స్‌. ప్రియురాలి పేరు మీద గుండెపై చెరిగిపోని ఓ పచ్చబొట్టే అతగాడి ప్రేమకు సాక్ష్యం. కొన్నాళ్లుగా లవ్వాడుకున్న ఈ ప్రేమపావురాలకు ఎక్కడో ఓచోట చెడింది. ఆమె మరొకళ్లతో ప్రేమలో పడిందన్న అనుమానం అతడ్ని పిచ్చోణ్ణి చేసింది. తరచూ గొడవ పడేవాడు కూడా.

ఇవి కూడా చదవండి

ఏప్రిల్ 11 నవ్య బర్త్‌డే. సెలబ్రేషన్స్‌కి రమ్మని పిలిస్తే వెళ్లలేదు. రెండు రోజుల తర్వాత బిలేటెడ్ విషెస్ చెప్పాడు. అక్కడితో ఆపెయ్యలేదు. కాస్త వెరైటీగా.. బిలేటెడ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా షురూ చేశాడు. నీ బర్త్‌డే ఎవరో చెయ్యడం ఏంటి నేనుండగా అంటూ రెండు రోజుల తర్వాత అరేంజ్‌మెంట్స్ ఘనంగా చేశాడు ప్రశాంత్.

మాంచి రుచికరమైన కేకు తెచ్చాడు. ఆమె చేతులతోనే కట్ చేయించాడు. షాకింగ్ ఏంటంటే.. అదే కత్తితో ప్రియురాలి కుత్తుకనూ కత్తిరించాడు. పుట్టినరోజునే ప్రేయసి నెత్తురు కళ్ల జూసి.. పైశాచికానందం పొందాడు. ఇంతకీ ఆమె పాల్పడ్డ నేరమేంటి అంటే పరాయి మగాళ్లతో చాటింగ్ చెయ్యడం.

కిల్లర్ ప్రశాంత్.. ప్రస్తుతం పోలీసుల కంట్రోల్‌లో ఉన్నాడు. ఎందుకయ్యా చంపావూ అంటే.. డిస్టర్బ్ చేసింది బ్రో.. అందుకే అప్‌సెట్‌ అయ్యా.. ఒక్క దెబ్బతో లేపేశా అంటూ చేసిన నేరాన్ని ఓపెన్‌గా ఒప్పేసుకున్నాడీ సైకో లవ్వర్. మరో చరిత్రవుతుందనుకున్న వీళ్ల ప్రేమకథ రక్తచరిత్రగా ముగిసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..