Bank New Rules: కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బ్యాంక్.. అలాంటి ట్రాన్సాక్షన్స్‌పై ఫైన్.. వివరాలివే..

ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై కస్టమర్ల బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినా, తక్కువ బ్యాలెన్స్ కారణంగా లావాదేవీ ఫెయిల్ అయినా.. రూ. 10+జీఎస్టీ పెనాల్టీ ఛార్జెస్‌ను వసూలు చేస్తుంది. ఈ కొత్త నిబంధన మే 1, 2023 నుంచి అమ్మలోకి రానుంది.

Bank New Rules: కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన బ్యాంక్.. అలాంటి ట్రాన్సాక్షన్స్‌పై ఫైన్.. వివరాలివే..
Pnb New Rules
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 18, 2023 | 9:33 PM

ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై కస్టమర్ల బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినా, తక్కువ బ్యాలెన్స్ కారణంగా లావాదేవీ ఫెయిల్ అయినా.. రూ. 10+జీఎస్టీ పెనాల్టీ ఛార్జెస్‌ను వసూలు చేస్తుంది. ఈ కొత్త నిబంధన మే 1, 2023 నుంచి అమ్మలోకి రానుంది. ఇందుకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

‘‘ప్రియమైన కస్టమర్లకు విజ్ఞప్తి. 1 మే, 2023 నుంచి ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసినా, తక్కువ బ్యాలెన్స్ కారణంగా లావాదేవీ ఫెయిల్ అయినా.. రూ. 10+జీఎస్టీ పెనాల్టీ ఛార్జెస్‌ను వసూలు చేయడం జరుగుతుంది.’’ అని పీఎన్‌బి తన కస్టమర్లకు మెసేజ్ పంపుతోంది. ఇక ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే, ఆ సమస్యను పరిష్కారానికి పీఎన్‌బీ ప్రత్యేక మర్గదర్శకాలను రూపొందించింది.

పీఎన్‌బి ప్రకారం..

1. ఏటీఎం లావాదేవీ విఫలమైతే ఫిర్యాదును స్వీకరించిన ఏడు రోజులలోపు ఫిర్యాదును పరిష్కరించడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

2. లావాదేవీ జరిగిన 30 రోజులలోపు క్లెయిమ్ చేసినప్పటికీ.. ఆ కంప్లైంట్‌ను పరిష్కరించడంలో ఆలస్యం జరిగితే.. బ్యాంకు రోజుకు రూ. 100 చోప్పున పరిహారం ఇస్తుంది.

3. ATMలో లావాదేవీ ఫెయిల్ అయితే PNB కస్టమర్‌లు కస్టమర్ కేర్ నెంబర్ 0120-2490000 లేదా టోల్ ఫ్రీ నంబర్‌లు 1800180222, 18001032222కు ఫిర్యాదు చేయవచ్చు.

ఇదిలాఉంటే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ సంతృప్త స్థాయిపై సర్వేను నిర్వహిస్తోంది. కస్టమర్లు PNB వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ సర్వేలో పాల్గొని, PNB సేవల గురించి తమ తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..