Viral Video: పూనకమొచ్చిందా ఏందీ.. సింహాల గుంపుపై అటాక్ చేసిన దున్నపోతు.. మామూలు కుమ్ముడు కాదది..

అడవిలో సింహాన్ని చూస్తే ఏ జంతువు అయినా హడలిపోవాల్సిందే. ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే. కాదు.. కూడదు అంటే ఆ రోజు, ఆ క్షణమే ఆ జంతువుకు లాస్ట్ అవుతుంది. భూమితో రుణం తీరిపోతుంది. కానీ, ఇక్కడ ఓ దున్నపోతు మాత్రం సింగిల్‌ వచ్చింది.

Viral Video: పూనకమొచ్చిందా ఏందీ.. సింహాల గుంపుపై అటాక్ చేసిన దున్నపోతు.. మామూలు కుమ్ముడు కాదది..
Lion Vs Bufalo
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 21, 2023 | 6:01 AM

అడవిలో సింహాన్ని చూస్తే ఏ జంతువు అయినా హడలిపోవాల్సిందే. ప్రాణ భయంతో పరుగులు తీయాల్సిందే. కాదు.. కూడదు అంటే ఆ రోజు, ఆ క్షణమే ఆ జంతువుకు లాస్ట్ అవుతుంది. భూమితో రుణం తీరిపోతుంది. కానీ, ఇక్కడ ఓ దున్నపోతు మాత్రం సింగిల్‌ వచ్చింది. సింహాల మందపై పడింది. దొరికిన సింహాన్ని దొరికినట్లు కుమ్మేస్తుంది. తన వాడీగా ఉన్న కొమ్ములతో ఎగేసి ఎగేసి మరీ కుమ్ముంది. ఆ దున్న దెబ్బకు అసలు ఏం జరుగుతుందో తెలియక బిత్తర పోయాయి సింహాలు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

సింహం సింగిల్‌గా వస్తుందనేది డైలాగ్.. కానీ, ఈ వీడియో చూస్తే ఆ డైలాగ్ మార్చాల్సిందే అంటారు. అవును మరి. పదుల సంఖ్యలో సింహాలు సేద తీరుతుండగా.. ఏదో పూనకమొచ్చినట్లుగా దూసుకొచ్చింది దున్నపోతు. గడ్డి పొదల్లో హాయిగా పడుకున్న సింహాల మందపై ఒక్కసారిగా అటాక్ చేసింది. ఇంతలో ఓ సింహం ఆ దున్నను గమనించింది. అటాక్ చేద్దామనుకుని దున్న మీద పడపోయింది. కానీ, అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. అప్పటికే ఆగ్రహంగా ఉన్న దున్న.. తన పదునైన కొమ్ములతో వీర కుమ్ముడు కుమ్మేసింది. ఆ సింహానికి సుస్సు పోయించింది. ఈ ఘటనతో బిత్తరపోయిన మిగతా సింహాలు అక్కడి నుంచి ఉడాయించాయి. కాగా, దున్నపోతు వీరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను, నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంత ధైర్యం దీనికి ఎలా వచ్చింది సామీ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!