Business Ideas : ఇంజనీర్ ఉద్యోగం మానేసి…ఆన్‌లైన్‌లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశాడు.లక్షలు సంపాదిస్తున్నాడు.
నేటియువత చాలా సృజనాత్మకతంగా ఆలోచిస్తున్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాకుండా...ఉన్నదానిలో చేసుకుంటూ బతుకుదామనే ధోరణి ఎక్కువైంది.

నేటియువత చాలా సృజనాత్మకతంగా ఆలోచిస్తున్నారు. ఉద్యోగాల కోసం వెంపర్లాకుండా…ఉన్నదానిలో చేసుకుంటూ బతుకుదామనే ధోరణి ఎక్కువైంది. ఉద్యోగాలకోసం ఉన్న సమయాన్ని వ్రుధా చేసుకునే బదులు వ్యాపారం వైపులు అడుగులు వేస్తే…తక్కువ సమయంలో ఎక్కువ సంపాధించవచ్చు. ఇంకొంతమందికి ఉద్యోగం చేయడం ఇష్టలేకనో, ఉద్యోగం చేస్తున్న చోట మానసిక ప్రశాంతత కరువై…ఉద్యోగాలకు స్వస్తి పలుకుతున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి…ఎక్కువ లాభాలు పొందుతున్నారు.
ఇంజనీర్ ఉద్యోగం మానేసిన ఓ యువకుడు కూడా మొదట విఫలమైనా…రెండో సారి సక్సెస్ అయ్యాడు. రెండు సార్లు విఫలమైనా పట్టు వదలని ఇద్దరు స్నేహితుల కథ ఇది. ఉద్యోగం మానేసి రూ.5000తో స్టార్ట్‌అప్‌ని ప్రారంభించాడు. నేడు ఈ కంపెనీ టర్నోవర్ రూ.10 లక్షలకు చేరుకుంది. పది మంది ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. వీరి కథేంటో పూర్తిగా చదువుదాం. మనకూ భవిష్యత్తులో పనికి వస్తుందేమో.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని అర్గోరా నివాసితులైన విశ్వజిత్, సాకేత్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారి కథ కూడా చాలా ఆసక్తికరంగా, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. స్నేహితులిద్దరూ రాత్రింభవళ్లు కష్టపడి పనిచేసిన కళ నేడు నెరవేరింది. ఒక లక్ష్యం పూర్తయ్యాక అంచెలంచెలుగా రెండో లక్ష్యం దిశగా సాగుతున్నారు.




వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన స్నేహితులిద్దరూ తమ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని ఊహించలేదు. నేడు రాజధాని రాంచీలో ఇద్దరిదే ఆధిపత్యం. 2019 సంవత్సరంలో కేవలం ఐదు వేల రూపాయలతో ‘వన్ టచ్ బుక్’ పేరుతో ఆన్‌లైన్ కంపెనీని ప్రారంభించాడు. నేడు ఈ సంస్థ 10 లక్షల టర్నోవర్‌కు చేరుకుంది. వారి కృషి కారణంగా, ఇప్పుడు రాంచీ ప్రజలు ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా ఒకే క్లిక్‌తో ఆన్‌లైన్ పుస్తకాలను ఆర్డర్ చేయవచ్చు. పుస్తకాలు కొనడానికి ఏ దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదొక్కటే కాదు, తన సంస్థ విక్రయించే పుస్తకాలు దుకాణాలు, ఇతర ఆన్‌లైన్ సైట్‌ల కంటే తక్కువ ధరకు లభిస్తాయి.
వన్ టచ్ బుక్ అనే వారి సైట్‌ని సందర్శించడం ద్వారా మీరు ఆర్డర్ చేసిన వెంటనే, ఒక గంటలోపు మీ ఇంటికి పుస్తకాల హోమ్ డెలివరీ చేయబడుతుంది. ఇంత తక్కువ సమయంలో ఇంటింటికీ పుస్తకాలను డెలివరీ చేసేందుకు రాజధాని రాంచీ చేస్తున్న ఏకైక ప్రయత్నం ఇదే. స్నేహితులిద్దరూ ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. జార్ఖండ్‌లోని ఇతర జిల్లాల్లోనూ ఈ తరహా సేవలు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి కృషి చేస్తున్నారు.
ఒడిశాలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే తనకు సొంతంగా వ్యాపారం చేయాలని భావించినట్లు విశ్వజీత్ తెలిపారు. స్నేహితుడు సాకేత్, అతను వివిధ స్టార్టప్‌లను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. కానీ విజయం అందుకోలేకపోయారు. ముందుగా బహిరంగ ప్రదేశాల్లో ఆటోమేటిక్ టాయిలెట్ సిస్టమ్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నించారు. కొన్ని కారణాల అందులోనూ విఫలమయ్యారు. దీని తర్వాత మరో స్టార్టప్‌ను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు. కానీ మోసానికి బలైపోయారు. కాలేజీలో క్యాంపస్ సెలక్షన్ అయ్యాక బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడూ ఏదో ఒక వ్యాపార ఆలోచనలు మనసులో వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా స్నేహితులిద్దరూ ఉద్యోగాలు వదిలేసి రాంచీకి తిరిగొచ్చారు.
విశ్వజీత్, సాకేత్ దుకాణదారులను సంప్రదించడం ప్రారంభించారు. ప్రారంభంలో, పుస్తక విక్రేతలు ఈ కొత్త సేవ కోసం సిద్ధం కావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ నిరంతర ప్రయత్నాల తర్వాత దుకాణదారులు దానిని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. రెండేళ్లు శ్రమించి రాజధాని రాంచీలోని దాదాపు అన్ని షాపులను ఈ సర్వీసుతో అనుసంధానం చేశారు. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 3000 మంది కస్టమర్లు తమతో చేరారని విశ్వజీత్, సాకేత్ చెప్పారు. వీరిలో రోజు విడిచి రోజు ఆర్డర్లు చేస్తూ ఉండే కస్టమర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు ఆర్డర్ చేసిన వెంటనే, కంపెనీ సభ్యులు పుస్తకాన్ని వారి ఇంటి వద్దకే అందజేస్తారు. అది కూడా గంటలోపే. వినియోగదారులను తయారు చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి