Gold Container Robbery: దేశ చరిత్రలోనే భారీ చోరీ.. భారీ గోల్డ్ కంటైనర్‌ని హెలికాప్టర్‌తో ఎత్తుకెళ్లారు..
కెనడాలో ఓ గోల్డ్ కంటైనర్‌ని క్షణాల్లో మాయం చేశారు దుండగు. అంతమంది సిబ్బంది ఉన్నా మూడో కంటికి తెలియకుండా కొట్టేశారు. ఇంతకీ అందులో ఉన్న బంగారం ఎంతో తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కెనడాలో ఓ గోల్డ్ కంటైనర్‌ని క్షణాల్లో మాయం చేశారు దుండగు. అంతమంది సిబ్బంది ఉన్నా మూడో కంటికి తెలియకుండా కొట్టేశారు. ఇంతకీ అందులో ఉన్న బంగారం ఎంతో తెలుసా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. కెనడాలో భారీ దోపిడీ జరిగింది. ఏకంగా ఎయిర్‌పోర్ట్ నుంచే బంగారంతో వెళుతున్న ఓ కంటెయినర్‌ను మాయం చేశారు దుండగులు. అందులో 20 మిలియన్ డాలర్ల విలువైన బంగారంతో పాటు మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్ 17 సాయంత్రం బంగారం, విలువైన వస్తువులతో కంటెయినర్ టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. కార్గో కోసం ఏర్పాటు చేసిన ప్లేస్‌కి కంటైనర్‌ని తరలించారు. అక్కడి నుంచి దానిని చేరార్సిన చోటుకి చేర్చేందుకు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎవరిపనిలో వాళ్లుండగా క్షణాల్లో కంటైనర్ మాయం అయింది. అయితే ఆ కంటెయినర్ ఎవరికి చెందిందనే వివరాలు.. ఎక్కడికి చేరాల్సినందనే వివరాలను మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తర అమెరికాలో ఈమధ్య కాలంలో జరిగిన భారీ దోపిడీ.. అలాగే కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా దీనిని చెబుతున్నారు. ఐదున్నర స్క్వేర్ ఫీట్స్‌తో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ కంటెయినర్‌ను అవలీలగా ఎత్తుకెళ్లిపోగా.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, అన్ని చోట్లా గాలిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఇది లోకల్ గ్యాంగ్‌ల పనే అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. చోరీకి గురైన కంటైనర్ ఇంకా కెనడాలోనే ఉందా? లేక దేశం దాటించారా? అనే కోణంతో పోలీసులకు క్లారిటీ లేకపోవడం గమనార్హం. గతంలోనూ కెనడా ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటి ఘటనలే రెండు, మూడు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..