Intercaste Marriage: ఆ దంపతులకు రూ. 10 లక్షలు ఇస్తున్న సర్కార్.. అప్లికేషన్ సహా పూర్తి వివరాలివే..

దేశ వ్యాప్తంగా కులాంతర, మతాంతర వివాహాలపై వివాదాలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఇలాంటి వివాహాలు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. కుల, మతాంతర వివాహాలు ‘పరువు హత్య’లకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

Intercaste Marriage: ఆ దంపతులకు రూ. 10 లక్షలు ఇస్తున్న సర్కార్.. అప్లికేషన్ సహా పూర్తి వివరాలివే..
Money Image Credit source: TV9 Telugu
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 22, 2023 | 7:21 AM

దేశ వ్యాప్తంగా కులాంతర, మతాంతర వివాహాలపై వివాదాలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల ఇలాంటి వివాహాలు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి. కుల, మతాంతర వివాహాలు ‘పరువు హత్య’లకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్‌లో.. కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతిని భారీగా పెంచింది. ఇకపై రాజస్థాన్‌లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రూ.10 లక్షలు అందజేస్తామని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. అయితే, గతంలో కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం రూ. 5 లక్షలు చెల్లించేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2006లో రాజస్థాన్ తొలిసారిగా ‘డా. సవితా బెన్ అంబేద్కర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రమోషన్ స్కీమ్’ పేరుతో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అగ్రవర్ణాలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఇద్దరు యువతీ యువకులు వివాహం చేసుకుంటే రూ. 50,000 ఇవ్వనున్నట్లు తొలుత ప్రకటించారు. 2013లో ఆ గ్రాంట్ మొత్తాన్ని రూ. 5 లక్షలకు పెంచారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.10 లక్షలకు పెంచారు. ఈ ప్రతిపాదన ప్రకారం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు పెళ్లి సమయంలో ఏకంగా రూ.5 లక్షలు అందజేస్తారు. మిగిలిన రూ.5 లక్షలను 8 ఏళ్లపాటు జాతీయ బ్యాంకులో జాయింట్ అకౌంట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చెల్లిస్తారు.

అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు కులాంతర వివాహం చేసుకున్న జంటల వయస్సు తప్పనిసరిగా 35 ఏళ్లలోపు ఉండాలి. ఈ పథకం ప్రకారం, వధూవరులు తప్పనిసరిగా హిందువులు అయి ఉండాలి. బహుభార్యత్వం అనుమతించబడదు. వివాహం ఒక్కసారి మాత్రమే చేసుకోవాలి. కులాంతర వివాహం చేసుకున్న జంటలు వివాహం నమోదు చేసుకున్న ఒక సంవత్సరంలోపు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు అందజేస్తాయి. 75 శాతం రాష్ట్రం, మిగిలిన 25 శాతం కేంద్రం ఇస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఈ పథకం కింద రూ.33.55 కోట్లు అందించగా ప్రస్తుత ఏడాది రూ.4.5 కోట్లు అందించింది. గత ఐదేళ్లలో మొత్తం 1,891 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు సమాచారం.

అంతేకాకుండా, ప్రత్యేక వికలాంగుల వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని రూ. 10 రెట్లు పెంచింది. వీరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 బదులు రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ప్రయోజనం పొందడానికి వారు 80 శాతం వైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. 2022లో మొత్తం 208 జంటలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..