Poonch Attack: ఒక జవాన్ ఏకైక కుమారుడు, మరొకరికి 7 నెలల కుమార్తె, ఐదుగురు అమరులైన సైనికుల కన్నీటిగాథ తెలుసా

పూంచ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికుల కథ వింటే ఎవరికళ్ళైనా చెమ్మగిల్లుతాయి. ఒకరికి ఏడు నెలల కుమార్తె ఉండగా.. మరొక జవాన్ తల్లిదండ్రులకు ఏకైక కుమారు.. ఇంకొక జవాన్ తండ్రి కార్గిల్ యుద్ధంలో మరణిస్తే.. ఇప్పుడు కుమారుడు ఉగ్రదాడిలో మరణించాడు.

Poonch Attack: ఒక జవాన్ ఏకైక కుమారుడు, మరొకరికి 7 నెలల కుమార్తె, ఐదుగురు అమరులైన సైనికుల కన్నీటిగాథ తెలుసా
Poonch Terror Attack
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2023 | 7:26 AM

ఏప్రిల్ 20న జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్‌ జరిగిన ఉగ్రదాడి ఐదుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. అమరాజవాన్లలో నలుగురు పంజాబ్‌కు చెందినవారు కాగా ఒకరు ఒడిశాకు చెందినవారు. దేశం కోసం వీరమరణం పొందిన ఈ సైనికుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వీధుల్లో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు మాత్రమే కాదు..  స్నేహితులు సన్నిహితులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఉగ్రవాదులకు సైన్యం తగిన సమాధానం చెప్పాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అమరులైన వీర జవాన్ల కథ వింటుంటే కన్నీళ్లు ఆగవు.

ఆర్మీ వాహనంలో భీంబర్ గలి నుంచి పూంచ్ జిల్లాలోని సాంగ్యోట్‌కు ఆర్మీ సిబ్బంది వెళ్తున్నారు. అనంతరం ఉగ్రవాదులు మెరుపుదాడి చేసి వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేశారు. గ్రెనేడ్ పేలడంతో కారులో మంటలు చెలరేగి ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఆస్పత్రిలో ఓ యువకుడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.

మన్‌దీప్ సింగ్- హవల్దార్ మన్‌దీప్ సింగ్ మేనమామ..మాట్లాడుతూ మార్చిలో ఒక నెల సెలవుపై ఇంటికి వచ్చాడని.. మన్‌దీప్ 20 రోజుల క్రితమే తిరిగి వెళ్లి విధుల్లో చేరినట్లు చెప్పాడు. కుటుంబంలో అతనే సంపాదనపరుడు. మొత్తం కుటుంబం మన్ దీప్ పైనే ఆధారపడి జీవిస్తోందని చెప్పారు. మన్‌దీప్‌ తల్లి వృద్ధురాలు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మన్ దీప్ సింగ్ అకాల మరణంతో కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.

ఇవి కూడా చదవండి

కుల్వంత్ సింగ్- లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ మోగా జిల్లాలోని చారిక్ గ్రామ నివాసి. కుల్వంత్ కొడుకు వయసు నాలుగు నెలలే. అదే సమయంలో అతనికి ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్న కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు ఊహ తెలియకముందే పిల్లలు తండ్రిని కోల్పోయారు. కుల్వంత్ సింగ్ తండ్రి కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడని బంధువులు చెబుతున్నారు. అప్పటికి కుల్వంత్‌ వయసు రెండేళ్లు మాత్రమే. అతని తండ్రి సాయుధ దళాలలో విధులను నిర్వహించేవారు.

Poonch Terrorist Attack

Poonch Terrorist Attack

హరికిషన్ సింగ్- పంజాబ్‌లోని బటాలా నివాసి హరికిషన్ సింగ్. హరికిషన్ వయస్సు కేవలం 27 సంవత్సరాలు. అతను 2017 సంవత్సరంలో సైన్యంలో చేరాడు. హరికిషన్ కు తల్లిదండ్రులు , భార్య ఉన్నారు. మూడేళ్ళ కుమార్తె ఉంది. హరికిషన్ అమరుడు అవ్వడానికి ఒక రోజు ముందు తన కుటుంబంతో వీడియో కాల్‌లో మాట్లాడారు.

సేవక్ సింగ్- భటిండా నివాసి సిపాయి సేవక్ సింగ్. ఇతనే కుటుంబానికి ఏకైక కుమారుడు. సేవక్ సింగ్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరిలో ఒకరు వివాహితులు కాగా, మరొకరు అవివాహితుడు. తమకు ఆధారమైన అన్న మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఉగ్రవాదులకు సైన్యం తగిన సమాధానం చెప్పాలని, ఇంకోసారి ఇలాంటి చర్యకు పాల్పడకూడదని సేవక్ సింగ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Poonch Terrorist Attack 1

Poonch Terrorist Attack 1

దేవాశిష్ బిస్వాల్- ఒడిశాలోని పూరీ జిల్లా ఖండాయత్ సాహి నివాసి దేవాశిష్ బిస్వాల్. లాన్స్ నాయక్ దేవాశిష్ బిస్వాల్ వివాహం 2021 సంవత్సరంలో జరిగింది. బిస్వాల్ కుమార్తె వయస్సు కేవలం 7 నెలలు. కుమార్తెకు మూడు నెలల వయస్సు ఉన్న సమయంలో బిస్వాల్ గ్రామానికి వచ్చాడు. వెంటనే ఇంటికి వస్తానని భార్యకు హామీ ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు అతని మృతదేహం ఇంటికి చేరుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..