DM G Krishnaiah: ఆ కలెక్టర్ నిజాయతీకి బహుమతి మరణం .. కారులోనుంచి ఈడ్చి మరీ చంపిన గ్యాంగ్.. 29 ఏళ్ల నాటి విషాద కథ

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన అలాంటి ఒక భయానక సంఘటనను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 29 ఏళ్ల మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. డిసెంబర్ 5, 1994 మిట్ట మధ్యాహ్నం ఒక కలెక్టర్ ను నడి రోడ్డుమీద కాల్చి చంపారు. తెలంగాణకు చెందిన ఆ కలెక్టర్ నిజాయతీకి మారుపేరుగా  నిలిచి నందుకు దారుణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

DM G Krishnaiah: ఆ కలెక్టర్ నిజాయతీకి బహుమతి మరణం .. కారులోనుంచి ఈడ్చి మరీ చంపిన గ్యాంగ్.. 29 ఏళ్ల నాటి విషాద కథ
Dm G Krishnaiah
Follow us
Surya Kala

|

Updated on: Apr 18, 2023 | 1:29 PM

కొన్ని సంఘటనలు దారుణ ఘటనలు ఎన్ని ఏళ్లు అయినా మనసునుంచి చెరిగిపోవు.. అవి కొన్ని సంఘటల సందర్భంలో మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన అలాంటి ఒక భయానక సంఘటనను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 29 ఏళ్ల మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. డిసెంబర్ 5, 1994 మిట్ట మధ్యాహ్నం ఒక కలెక్టర్ ను నడి రోడ్డుమీద కాల్చి చంపారు. తెలంగాణకు చెందిన ఆ కలెక్టర్ నిజాయతీకి మారుపేరుగా  నిలిచి నందుకు దారుణంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గోపాల్‌గంజ్ డీఎం జి. కృష్ణయ్య తన కారులో హైవే మీద వెళ్తున్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు అతని కారు అడ్డగించి బలవంతంగా కారులోంచి బయటకు లాగి అక్కడికక్కడే కాల్చిచంపారు.

డిఎం జి. పాట్నా సమీపంలోని హాజీపూర్ పట్టణంలో ప్రత్యేక సమావేశాన్ని ముగించుకుని కృష్ణయ్య ముజఫర్‌పూర్ హైవే మీదుగా గోపాల్‌గంజ్‌కు వెళ్తున్నారు. ఖబ్రా గ్రామ సమీపంలో దారిలో.. ప్రజలు ఛోటాన్ శుక్లా మృతదేహాన్ని ఉంచి.. పరిపాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. అదే సమయంలో దురదృష్టవశాత్తు DM G. కృష్ణయ్య కారు అక్కడికి రావడంతో  ఆగ్రహించిన గుంపు అతనిపై దాడి చేసింది.

డీఎంపై రమైన దాడి జరిగిందంటే వాస్తవానికి.. ఈ సంఘటనకు ఒక రోజు ముందు చోటన్ శుక్లా ఉత్తర బీహార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ముజఫర్‌పూర్‌లో హత్య చేయబడ్డాడు. ఛోటాన్ శుక్లా ముజఫర్‌పూర్ జిల్లాలో తన సొంత అండర్‌వరల్డ్‌ డాన్. నగరంలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్. అతని హత్యతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యాపించాయి. ఛోటాన్ శుక్లా మద్దతుదారులు ఎవరిపై అనుమానం కలిగినా వారిపై దాడి చేసేవారు.

ఇవి కూడా చదవండి

డీఎం కృష్ణయ్య  ప్రయాణిస్తున్న వాహనంపై రెడ్‌లైట్‌ను చూసి నినాదాలు చేసిన ప్రజలు రెచ్చిపోయి వాహనంపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. అయితే.. కారులో కూర్చున్న డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది ఇది ముజఫర్‌పూర్ కలెక్టర్ కారు కాదని..  గోపాల్‌గంజ్ కలెక్టర్ అని అరుస్తూనే ఉన్నారు.. అయితే దాడి చేసిన గుంపు డ్రైవర్ చెబుతున్న మాటలను పట్టించుకోలేదని దర్యాప్తు నివేదికలో వెల్లడైంది.

డీఎం కృష్ణయ్య హత్య తర్వాత ఏం జరిగిందంటే? ఈ మారణహోమం బీహార్ లోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. బీహార్ ‘గంగా’, ‘గండక్’ నదులు ప్రవహించే పుణ్యభూమి మాత్రమే కాదు.. అప్పట్లో గూండాలు హల్ చల్ చేసే రాష్ట్రమని కూడా అంటారు. మాఫియా గ్యాంగ్, బాహుబలి ఇక్కడ రెండు పెద్ద గుర్తింపులు. ఒకప్పుడు బీహార్‌లో రౌడీలకు స్వర్ణయుగం ఉండేది. ఆ సమయంలో నిజాయితీపరుడైన, కష్టపడి పనిచేసే జిల్లా మేజిస్ట్రేట్‌ తప్పేమీ లేకుండా కొందరు దుండగులు చేసిన దాడితో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఈ హత్య విచారణ మొదట దిగువ కోర్టులో చేశారు. 2007 సంవత్సరంలో ఆనంద్ మోహన్, చోటాన్ శుక్లా సోదరుడు మున్నా శుక్లా, అఖ్లాక్ అహ్మద్, అరుణ్ కుమార్‌లకు మరణశిక్ష విధించబడింది. అయితే పాట్నా హైకోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. అయితే, 2008లో, సాక్ష్యాధారాలు లేకపోవడంతో, కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అయితే ఆనంద్ మోహన్‌కు సుప్రీంకోర్టులో కూడా ఉపశమనం లభించలేదు. ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడు.

DM  కృష్ణయ్య ఎవరంటే?  హత్య చేయబడిన ప్రభుత్వ అధికారి డీఎం జి. కృష్ణయ్య వాస్తవానికి తెలంగాణలోని మహబూబ్‌నగర్ నివాసి. 1985 బీహార్ కేడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. అతడు నిజాయితీగల అధికారి.

అవును. కృష్ణయ్య వ్యక్తిత్వం గురించి.. మాజీ GDP అభయానంద్ … క్రిష్నయ్య నిజాయితీ, వ్యక్తిత్వం, సరళత గురించి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ రాశారు.  కృష్ణయ్య కు ఎవరైనా తాము లంచం ఇచ్చామని చెప్పే ఒక్కరు కూడా లేదు. బాధితుల నుంచి ఒక్క కప్పు టీ కూడా లంచంగా తీసుకున్నది లేదు.. చాలా మంచి నిజాయతీగా ఆఫీసర్ అంటూ తోటి ఆఫీసర్స్ ఇప్పటికీ కృష్ణయ్యను గుర్తు చేసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!