Tiger: పులి సంచారంతో ప్రజలు గజగజ.. మూడు రోజుల్లో ఇద్దరు బలి.. 25 గ్రామాల్లో కర్ఫ్యూ..
ఉత్తరఖాండ్ లోని పౌరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల్లోనే ఇద్దర్ని పులి చంపేయడంతో వివిధ గ్రామాల ప్రజల్లో భయాందోళన మొదలైంది. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 13 న డల్ల గ్రామంలోని ఓ 70 ఏళ్ల వృద్ధుడిపై పులి దాడి చేసి చంపేసింది.
ఉత్తరఖాండ్ లోని పౌరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల్లోనే ఇద్దర్ని పులి చంపేయడంతో వివిధ గ్రామాల ప్రజల్లో భయాందోళన మొదలైంది. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 13 న డల్ల గ్రామంలోని ఓ 70 ఏళ్ల వృద్ధుడిపై పులి దాడి చేసి చంపేసింది. అనంతరం శనివారం రోజున సిమ్లీ గ్రామంలో రన్ వీర్ సింగ్ నేగి అనే వ్యక్తి శరీరాన్ని సగం వరకు తినేసింది. ఆదివారం రోజున గ్రామస్థులు అతడ్ని గుర్తించారు. మూడు రోజుల్లోనే ఈ రెండు ప్రమాదాలు జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 25 గ్రామాలకు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రతిరోజు సాయంత్రం 7.00 PM నుంచి ఉదయం 6.00 AM వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని జిల్లా మెజిస్ట్రేట్ అశిష్ చౌహన్ తెలిపారు.
పౌరి డివిజనల్ ఫారెస్టు అధికారి స్వప్నిల్ అనిరుద్, పోలాసులు డల్లా గ్రామంలో క్యాంపిగ్ ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ ఆ పులిని పట్టుకునేందుకు ఓ కేజి ని కూడా పెట్టారు. పశువుల మేత కోసం అడవిలోకి ఎవరూ వెళ్లకూడదని గ్రామస్థులకి సూచించారు. పశుసంవర్థక శాఖ ప్రజల ఇంటివద్ద పశుగ్రాసాన్ని అందుబాటులో ఉంచాలని కోరారు. డల్లా గ్రామ పొలాల్లోని పులి సంచరిస్తుండగా దానికి కొద్ది దూరంలో పశువుల మేత మేస్తున్న ఓ వీడియో బయటపడింది.
పులి ఆనవాళ్లు తెలుసుకునేందుకు వివిధ గ్రామాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఆ గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు కూడా మూసివేయించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ఆ పులిని బంధించి, తాము ఆదేశాలు ఇచ్చేవరకు తెరవద్దని సూచించారు. అలగే పులి వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ఫారెస్చు రేంజర్ మహేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.