AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap-Telangana: మంత్రి హరీష్‌కు ఏపీ మంత్రులకు మధ్య వార్‌.. బీఆర్‌ఎస్‌పై పవన్‌‌కు ఎందుకంత ప్రేమన్న పేర్ని నాని..

ఏపీ, తెలంగాణ మంత్రుల రగడ మధ్యలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ సమస్యను మరో మలుపు తిప్పింది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడొద్దన్న జనసేనాని కామెంట్స్‌పై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. అలాగే తాను ఏమీ అనకపోయినా.. ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని కౌంటర్‌ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.

Ap-Telangana: మంత్రి హరీష్‌కు ఏపీ మంత్రులకు మధ్య వార్‌.. బీఆర్‌ఎస్‌పై పవన్‌‌కు ఎందుకంత ప్రేమన్న పేర్ని నాని..
Ap And Telangana
Sanjay Kasula
|

Updated on: Apr 17, 2023 | 9:37 PM

Share

ఏపీ, తెలంగాణ మంత్రుల రగడలోకి పవన్‌కల్యాణ్ ఎంట్రీ మరో మలుపు తిప్పింది. కొద్దిరోజులుగా తెలంగాణ మంత్రి హరీష్‌ రావు వర్సెస్‌ ఏపీ మంత్రుల ఎపిసోడ్‌ రాజకీయ చిటపటలకు వేదికగా మారింది. ఏపీ మంత్రులు కొందరు పదునైన విమర్శలు చేశారు. అప్పటి నుంచి అటూ ఇటూ తెలుగు రాష్ట్రాల మధ్య దుమారం ఆగడం లేదు. ఈ అంశంలోకి తాజాగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా ఎంట్రీ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌పై వైసీపీ నేతల పంచ్‌లు విసురుతున్నారు.  అంతే.. వైసీపీ నేతలు జనసేనానిని గురిపెట్టారు. పంచ్‌లు, పవర్‌ఫుల్‌ పొలిటికల్‌ డైలాగ్స్‌తో విరుచుకుపడ్డారు అధికారపార్టీ నాయకులు. విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోతున్నాయన్న పవన్‌ కల్యాణ్‌.. తెలంగాణ ప్రజల్ని నిందించిన ఏపీ మంత్రులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పై మంత్రి హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత వైసీపీ మంత్రులు చేసిన విమర్శలు, ప్రతి విమర్శలు హద్దులు దాటి పోయారని జనసేన చీఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు వేరు.. ప్రజలు వేరు. నాయకులు చేసిన వ్యాఖ్యలకు ప్రజలకు సంబంధం లేదన్నారు. ఇది తెలంగాణ నాయకులు, ఏపీ మంత్రులకు కూడా వర్తిస్తుందన్నారు. హరీశ్‌ రావు వ్యాఖ్యలు బాధ కలిగిస్తే ఏపీ నేతలు వ్యక్తిగతంగానే మాట్లాడాలి. అంతేకానీ తెలంగాణ ప్రజలను తిట్టడం.. తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడడం నాకు మనస్థాపం కలిగించిందన్నారు పవన్ కల్యాణ్.

దీంతో ఏపీ మంత్రులకు మళ్లీ హరీష్‌రావు కౌంటర్‌ ఇచ్చారు. ఇక తనపై వరుసపెట్టి ఏపీ మంత్రులు చేస్తున్న విమర్శలకు మరోసారి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. మొత్తానికి ఏపీ, తెలంగాణ మంత్రుల రగడ రాజకీయ సెగలు కక్కడంతోపాటు మలుపులు తిరుగుతోంది. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయని.. ఇదే మాట చెప్పానే తప్ప.. ఏపీ ప్రజల్ని తిట్టలేదన్నారు. కానీ అక్కడి మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని.. ప్రత్యేకహోదా,విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించారు. ఇందులో ఏమైనా తప్పుందా? ఉన్నమాట అంటే ఉలికిపాటు ఎందుకు? మీకు చేతనైతే హోదా, విశాఖ ఉక్కుపై పోరాడండాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. సమాధానం చెప్పలేక .. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారా? మా రాష్ట్రం ఎంతగొప్పగా ఉందో చెప్పేందుకు ఇతర రాష్ట్రాలతో పోలుస్తాం కదా? మా రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తుందని చెప్పా? మా కేసీఆర్ చేసిన పనిని కచ్చితంగా చెప్పుకోవాలి కదా? అని మంత్రి హరీష్ చెప్పడం విశేషం,

మరిన్ని తెలంగాణ వార్తల కోసం