Heavy Rains: మండువేసవిలో వడగళ్ల వర్షం.. హైదరాబాద్ వాసులకు చల్లని ఉపశమనం..
సూర్యుడి ప్రతాపంతో హడలిపోతున్న హైదరాబాద్ వాసులను వరుణుడు కరుణించాడు. వడగళ్ళ వానతో భూతాపం చల్లారింది. వడగళ్ళ వానతో... మంచుకురిసేవేళలో నగరవాసుల మనసు మురిసింది.
మండువేసవిలో మల్లెలవానలా ఉంది. కానీ కాదు. మల్లెల వానకాదది.. కాకపోతే చల్లని.. మమానగరవాసుల్ని మురిపించి, మైమరపించిన వడగళ్లవాన. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో నగర వాసులు మండేఎండల నుంచి కాస్త ఊరట పొందారు. కాంక్రీటు నగరంలో కురిసిన వడగళ్లను చూసి ఎంజాయ్ చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానతో నగరం తడిచి ముద్దయ్యింది. పాతబస్తీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సంతోష్ నగర్, బాలాపూర్, కర్మంఘట్, దిల్ షుక్ నగర్, పాతబస్తీ లో చార్మినార్, రాజేంద్ర నగర్, నాంపల్లి, ఖైరతాబాద్ వైపు వాన కాసేపే అయినా దంచికొట్టింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం మండుటెండల్నించి కాస్త ఉపశమనాన్నిచ్చింది. అయితే ధూల్‌పేట, చార్మినార్ లాంటి అనేక చోట్ల వడగళ్ళు కురిశాయి.
గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ నగర వాసుల్ని సూర్యుడి భగభగలు హడలెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో జనం ఇళ్ళలోనుంచి బయటకు రావడానికి భయపడుతోన్న పరిస్థితి. అలాంటి సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం నగర వాసులకు ఊరట నిచ్చింది.
ఇక ఆబిడ్స్, బషీర్ బాగ్‌లలోనూ వర్షంతో పాటు వడగళ్ళు కురిశాయి. పార్క్ చేసి ఉన్న కార్లపై భారీగా వడగళ్ళు పడ్డాయి. అయితే వడగళ్ల పరిమాణం చిన్నగా ఉండడంతో వాహనాలకు ఎటువంటి నష్టం కలగలేదు. నగరంలోని ట్యాంక్‌బండ్ సహా కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన కురిసింది. పాతబస్తీ, హైకోర్టు తదితర ప్రాంతాల్లో భారీ శబ్దంతో వడగళ్ళు కురిశాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
వాతావరణం ఇలా..
ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయి. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. మంగళవారం పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
మంగళవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
రాయలసీమలో పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం