AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముళ్ల పొదల్లో కుళ్లిన మృతదేహం.. విచారణతో వెలుగులో సంచలన నిజం..

శంషాబా‌ద్‌లో అనుమానాస్పద స్థితిలో భారతి అనే బాలిక మృతిని హత్యగా పోలీసులు తేల్చారు. ఈ హత్యను బాలిక మేనమామ కొడుకే..

Hyderabad: ముళ్ల పొదల్లో కుళ్లిన మృతదేహం.. విచారణతో వెలుగులో సంచలన నిజం..
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 17, 2023 | 7:21 PM

Share

శంషాబా‌ద్‌లో అనుమానాస్పద స్థితిలో భారతి అనే బాలిక మృతిని హత్యగా పోలీసులు తేల్చారు. ఈ హత్యను బాలిక మేనమామ కొడుకే చేసినట్లు నిర్ధారించారు. కొన్నూరు భారతి, వనపర్తికి చెందిన తన మేనమామ కొడుకు విష్ణు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగింది. ఆ తర్వాత 4 నెలలుగా విష్ణుని దూరం పెట్టిన భారతి.. ఇతరులతో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. టిది తట్టుకోలేని విష్ణు ఈ హత్యకు పధకం పన్నాడు. ఆ యువతిని నమ్మించి స్థానిక మధురానగర్‌లోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్ళి బలవంతంగా అత్యాచారం చేసి.. ఆపై బండ రాయితో మోది హత్య చేశాడు. ఈ హత్య ఏప్రిల్ 11న చోటు చేసుకోగా.. ఆ తర్వాత మూడు రోజులు అనగా ఏప్రిల్ 14న కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం పోలీసులకు లభ్యమయ్యింది. కాగా, ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరికి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో విష్ణుని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె స్రవంతి ఇంటి వద్దే ఉంటుంది. ఆ దంపతులు ఇద్దరూ కూడా అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ నెల 11న ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇక అదృశ్యమైన బాలిక ఆనవాళ్లతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా.. ఓ మృతదేహం మధురానగర్‌లోని ముళ్ల పొదల్లో పోలీసులకు లభ్యమైంది. మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా.. తమ కూతురుదేనని తల్లిదండ్రులు నిర్ధారించారు. ఆ సమయంలో బాలికను తలపై రాయితో మోది చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. అలాగే ఈ ఘటనను పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇక ఎట్టకేలకు హత్య చేసింది నిందితుడు బాలిక మేనమామ కొడుకేనని తేల్చారు.