Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోఆప్ నేతకు కష్టాల పరంపర.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఆ రోజు వరకు జైలులోనే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ నేత మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. ఈ కేసులో ఈడీ త్వరలో అదనపు ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయబోతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆప్ నేత మనీశ్ సిసోడియాకు కష్టాల పరంపర కొనసాగుతోంది. ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఎవెన్యూ కోర్ట్ పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 27 వరకూ, ఈడీ కేసులో ఈ నెల 29 వరకూ జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఆదేశాలు జారీ చేశారు. అరుణ్ పిళ్లై కస్టడీని కూడా న్యాయస్థానం వచ్చే నెల ఒకటో తేదీ దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను సీబీఐ అధికారులు, ఈడీ అధికారులు వేరుగా ప్రశ్నించారు. ఈ కేసులో త్వరలో ఈడీ మరో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. సిసోడియా, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, అమన్‌దీప్‌పై అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే ఒక ప్రధాన, 2 అదనపు ఛార్జిషీట్లు దాఖలు చేసింది. మూడో అదనపు ఛార్జిషీట్లో సిసోడియా, రామచంద్రన్ పిళ్ళై, అమన్‌దీప్‌పై అభియోగాలు నమోదు చేయనుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ ఫిభ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అప్పటినుంచి సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు.
ఇదే కేసుకు సంబంధించి ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు 161 సీఆర్‌పీసీ కింద ప్రశ్నల వర్షం కురిపించారు. సాక్షిగానే ఆయన్ను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సాక్షులు, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నించారు. మౌఖికంగా కేజ్రీవాల్ నుంచి సమాధానాలు తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం