Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త..! జూలై 1 నుంచి యాత్ర షురూ..

అమర్‌నాథ్ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందువులు పవిత్రంగా భావించే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిఏడాది భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఈ ఏడాది జులై 1న ప్రారంభంకానున్న అమర్​నాథ్​యాత్రలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే మీకు ముఖ్యమైన అప్డేట్.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త..! జూలై 1 నుంచి యాత్ర షురూ..
Amarnath Yathra
Follow us

|

Updated on: Apr 18, 2023 | 6:42 AM

అమర్‌నాథ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో మంచు రూపంలో కనిపించే అమర్‌నాథ్‌ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఏటా భారీగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తుల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ యాత్ర సాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు అమర్‌నాథ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లో రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లు దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో జరుగుతాయని వెల్లడించారు. అందులో 316 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ శాఖలు, 37 ఎస్‌ బ్యాంక్‌ శాఖలు, 99 ఎస్‌బీఐ బ్యాంక్‌ శాఖలు ఉన్నాయని అధికారులు చెప్పారు.

అయితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లో అధికారులు కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి.. వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా రెండు మార్గాల ద్వారా యాత్ర కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను లైవ్‌ టెలికాస్ట్‌ చేయనున్నారు. ఇక ఈ యాత్రలో పాల్గొనాలనుకొనే ఔత్సాహిక యాత్రికులు తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను పొందడం తప్పనిసరన్నారు. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలి వస్తారన్న అంచనా ఉంది. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Latest Articles
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
ఏపీ, దేశంలో ఎన్డీయే గెలుపు ఖాయం.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే.!
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
కలలో పాము కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'
'తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..'