Shani Jayanti: మీ జాతకంలో శని దోషం ఉందా? శని జయంతి రోజున చేయాల్సిన పూజ, పరిహాలు మీకోసం

పంచాంగం ప్రకారంఈ ఏడాది శని జయంతి మే 18, 2023 గురువారం ఉదయం 09:42 గంటలకు ప్రారంభమై, మే 19, 2023 శుక్రవారం 09 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథి ప్రకారం, ఈ సంవత్సరం శని జయంతి పవిత్ర పండుగ మే 19, 2023 న జరుపుకోనున్నారు. 

Shani Jayanti: మీ జాతకంలో శని దోషం ఉందా? శని జయంతి రోజున చేయాల్సిన పూజ, పరిహాలు మీకోసం
Shani Nakshatra Gochar
Follow us

|

Updated on: Apr 18, 2023 | 10:41 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి భూమిపై జన్మించిన వెంటనే నవగ్రహాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఈ నవగ్రహాలలో ఒకటి శనీశ్వరుడు. హిందూ మతంలో దేవుడిగా పూజిస్తారు. అయితే శనీశ్వరుడు పేరు విన్న వెంటనే ఎవరిమనసులోనైనా ఒకలాంటి భయాందోళనలు కలగవచ్చు. అయితే హిందూ మతంలో శనీశ్వరుడు న్యాయానికి అధిపతి. మనిషి చేసిన కర్మలకు తగిన ఫలాలు ఇస్తాడు అని భావిస్తారు. పంచాంగం ప్రకారం.. సూర్యదేవుని కుమారుడైన శనిదేవుడు జన్మించిన రోజు శని జయంతి. వైశాఖ మాసం అమావాస్య తిథి నాడు ఆయన జన్మదినం. ఈ సంవత్సరం మే 19, 2023 న శని జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన పండుగకు సంబంధించిన పూజా విధానం, శుభ సమయం, చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారంఈ ఏడాది శని జయంతి మే 18, 2023 గురువారం ఉదయం 09:42 గంటలకు ప్రారంభమై, మే 19, 2023 శుక్రవారం 09 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథి ప్రకారం, ఈ సంవత్సరం శని జయంతి పవిత్ర పండుగ మే 19, 2023 న జరుపుకోనున్నారు.

శని జయంతి పూజా విధానం శని జయంతి రోజున శనిదేవుని అనుగ్రహం పొందడానికి  తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసి.. అనంతరం శనీశ్వరుడు తండ్రి అనగా సూర్యదేవుడిని పూజిస్తూ, రాగి పాత్రతో ఆయనకు అర్ఘ్యం సమర్పించండి. శని దేవుడి ఆలయానికి వెళ్లి శని దేవుడికి ఆవాల నూనె, నీలం పువ్వులు, నల్ల నువ్వులను సమర్పించండి.  శని దేవుడికి ఆవాల నూనె దీపం వెలిగించ.. “ఓం శం శనిచారాయ నమః” మంత్రాన్ని జపించండి.

శని జయంతి రోజున చేయాల్సిన పరిహారాలు  ఎవరి జాతకంలోనైనా శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉన్నట్లయితే లేదా ఏలినాటి శని వలన కలిగే బాధల కారణంగా మీరు  ఇబ్బంది పడుతున్నట్లయితే.. శని జయంతి రోజున శనీశ్వరుడిని ప్రత్యేకంగా పూజించాలి. శని జయంతి రోజున స్నానం చేసి తడి బట్టలు ధరించి ఆవనూనె నైవేద్యంగా పెట్టి శని మంత్రాన్ని మనస్సులో జపించి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలని నమ్మకం. శని జయంతి నాడు ఈ పరిహారాన్ని చేయడం వల్ల శని గ్రహ బాధలు, ఏలినాటి శని వలన కలిగే బాధలు త్వరలోనే తొలగిపోతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)