Astro Tips: పొరపాటున కూడా ఈ రోజు, ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి.. ఇస్తే ఆ డబ్బులను మరచిపోండి.

కొంత మంది అప్పులపాలై చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఇతరులకు ఇచ్చిన సొంత డబ్బు అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్ ను ఊహించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

Astro Tips: పొరపాటున కూడా ఈ రోజు, ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి.. ఇస్తే ఆ డబ్బులను మరచిపోండి.
Astro Tips For Money
Follow us

|

Updated on: Apr 18, 2023 | 12:48 PM

మనిషి జీవితంలో డబ్బులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రూపాయి ప్రతి వ్యక్తి జీవితాన్ని నడిపిస్తుందనేది సత్యం.. డబ్బులు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ మనీ లెండింగ్ లావాదేవీలు చేయడానికి కారణం ఇదే. కొంత మంది అప్పులు చేసి రికవరీ చేస్తారు. అదే సమయంలో కొంత మంది అప్పులపాలై చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఇతరులకు ఇచ్చిన సొంత డబ్బు అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్ ను ఊహించుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

బుధవారం డబ్బుని అప్పుగా ఇవ్వకండి

ఎట్టిపరిస్థితుల్లోనూ బుధవారం రుణం ఇవ్వవద్దు. ఈ రోజు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదని నమ్ముతారు. బుధవారం గణేశుడిని పూజించాల్సిన రోజు.. వినాయకుడు శుభ లాభాలకు అధినాయకుడు. బుధవారం నాడు అప్పు ఇవ్వకపోవడానికి కారణం ఇదే.. ఇలా చేయడం వలన గణపతికి కోపం వస్తుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

మంగళవారం అప్పు ఇస్తే ధన నష్టం

మంగళవారం కూడా డబ్బు లావాదేవీలు చేయకూడదు. ఈ రోజున రుణం తీసుకోవడం వల్ల డబ్బు నష్టం, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ రోజు తీసుకున్న రుణం రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. అయితే తిరిగి చెల్లించిన రుణం శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజున రుణం తీసుకోవడం పురాణాల గ్రంథాల్లో నిషేధించబడింది. ఈ రోజు రుణం తీసుకోకుండా పాత రుణం ఉంటే తిరిగి చెల్లించాలి.

అమావాస్య రోజు రుణం ఇవ్వకూడదు

పరిస్థితి ఎలా ఉన్నా లేదా ఎవరైనా మీకు ఎంత సన్నిహితంగా ఉన్నా.. అమావాస్య నాడు అప్పు ఇవ్వకూడదు. అమావాస్య రోజున ప్రతికూల శక్తులు చురుకుగా ఉంటాయని నమ్మకం. దీంతో ఈ రోజున ఇచ్చిన అప్పు మీ సంపదపై కూడా ప్రభావితం చూపుతుందని విశ్వాసం. జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు.

భద్రకాలంలో అప్పు ఇస్తే.. 

భద్ర కాలం జరిగే ఆ సమయంలో శుభ కార్యాలు నిషిద్ధం. భద్ర కాలాన్ని అశుభ సమయంగా పరిగణిస్తారు. ఇది విభేదాలు, గొడవలను  సృష్టిస్తుంది. ఈ సమయంలో డబ్బు లావాదేవీలు డబ్బు సంపాదించడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. మనుషుల మధ్య సంబంధాలు చెడిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)