Success Mantra: కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.. దీనికి సంబంధించి 5 ముఖ్య విషయాలు మీకోసం

ఎవరికైనా సరే కోపం చాలా హానికరం. తనకు తాను చాలా అదుపు కోల్పోయిన తర్వాత అసలు విషయం గ్రహిస్తాడు. సాధువులు, మహా పురుషులు ఎప్పుడూ కోపానికి దూరంగా ఉండమని సలహా ఇవ్వడానికి ఇదే కారణం. ఎందుకంటే మీ నోటి నుండి కోపం అనే బాణం బయటకు వస్తే.. అనంతరం చాలా పశ్చాత్తాపపడతారు.

Success Mantra: కోపం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది.. దీనికి సంబంధించి 5 ముఖ్య విషయాలు మీకోసం
Thoughts On Anger
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2023 | 12:00 PM

ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో కోపం తెచ్చుకుంటాడు. కోపాన్ని అదుపులో పెట్టుకునే వారు కొందరైతే, కోపం వచ్చిన వెంటనే తమపై తాము నియంత్రణ కోల్పోతారు. మరోవైపు, ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు, ఎంత కోపం తెచ్చుకుంటే సముచితంగా ఉంటుందో బాగా తెలిసిన వారు కూడా ఉన్నారు. అంటే తమకు కోపం వచ్చినప్పటికీ విచక్షణ కోల్పోయే బదులు.. కోపం వచ్చిన సమయంలో అదుపులో ఉంచుకునే నేర్పుని అలవరుచుకుంటారు.

ఎవరికైనా సరే కోపం చాలా హానికరం. తనకు తాను చాలా అదుపు కోల్పోయిన తర్వాత అసలు విషయం గ్రహిస్తాడు. సాధువులు, మహా పురుషులు ఎప్పుడూ కోపానికి దూరంగా ఉండమని సలహా ఇవ్వడానికి ఇదే కారణం. ఎందుకంటే మీ నోటి నుండి కోపం అనే బాణం బయటకు వస్తే.. అనంతరం చాలా పశ్చాత్తాపపడతారు. అటువంటి పరిస్థితిలో  కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలనే ప్రశ్న తలెత్తుతుంది. జీవితంలో కోపం వల్ల కలిగే నష్టాన్ని, దానిని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి సక్సెస్ సూత్రాల గురించి తెలుసుకుందాం..

  1. కోపం వచ్చినప్పుడు చెడు జరగకుండా ఉండాలంటే మౌనమే ఉత్తమ మార్గం. అటువంటి పరిస్థితిలో.. కోపం వచ్చినప్పుడల్లా, చర్యకు ప్రతి స్పందించవద్దు. కాసేపు ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్ళండి. నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే నిశ్శబ్దం, శాంతి మాత్రమే మీ కోపాన్ని నియంత్రించగలవు.
  2. కోపం వచ్చినప్పుడు ఎవరినీ దుర్భాషలాడకండి. ఎందుకంటే కోపంతో మాట్లాడే  మాటలు చాలా విషపూరితమైనవి..  అవి జీవితమంతా మీరు చెప్పిన మధురమైన మాటలును పరిస్థితులను క్షణాల్లో నాశనం చేస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఏదైనా విషయంలో కోపం ఎక్కువైతే.. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే కోపంతో  ఉన్న సమయంలో అతని విచక్షణ, మనస్సు , బుద్ధి నియంత్రణలో ఉండవు.
  5. మనిషి తన జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసినా అలసిపోడు. కానీ ఎవరైనా తన పట్ల కోపం ప్రదర్శించినా,  తన గురించి చింతించినా అలసిపోతాడు.
  6. మరిగే నీటిలో ఎవరైనా తమ ప్రతిబింబాన్నిచూడలేరు.. అదే విధంగా కోపంతో ఉన్నప్పుడు వాస్తవాన్ని చూడలేరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)