- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti for happy and good life with positive attitude in telugu
Chanakya Niti: చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటించి చూడండి.. వ్యాపారంలో లాభాలు మీ సొంతం
ఆచార్య చాణక్యుడి విధానాలు, అతని జ్ఞానం నేటి కాలంలో కూడా చాలా సందర్భోచితంగా పరిగణించబడుతుంది. అతను చెప్పిన నియమాలు, విషయాలు అనుసరించే వ్యక్తి, ప్రతి రంగంలో విజయం సాధిస్తాడు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.
Updated on: Apr 12, 2023 | 12:45 PM

ఆచార్య చాణక్యుడి విధానాలు ఎంత ప్రభావవంతం అంటే ఒక సాధారణ పిల్లవాడిని అంటే చంద్రగుప్తుడిని చక్రవర్తిగా చేసాడు. చాణక్యుడి విధానాలు నేటి సమాజంలోని ప్రజలు అనుసరణీయంగా పరిగణించబడుతున్నాయి. జీవితంలో ఆశించిన విజయాన్ని పొందడానికి, సమాజంలో మీ గౌరవాన్ని పెంచుకోవడానికి ఈ విధానాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఇంట్లో లేదా సమాజంలో అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాలనుకుంటే చాణుక్యుడు చెప్పిన ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి.

భర్త, భర్తలు ఇద్దరూ ఒకరినొకరు అబద్దాలు చెప్పుకుంటుంటే.. ఆ బంధంలో బీటలు ఏర్పడతాయి. ఒకొక్కసారి ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. కనుక భార్య, భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.

మార్గనిర్దేశనం: పిల్లలకు చిన్నతనం నుంచే సన్మార్గంలో నడవాలని నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యమని.. వారిలో సత్ప్రవర్తన బీజాలు నాటాలని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్యుడు ఏ విత్తనం నాటితే అదే రకం చెట్టు పండ్లు వస్తాయి.. అదే విధంగా చిన్నతనంలో తమ పిల్లను ఎలా నడిపిస్తే పెద్ద అయ్యాక అలాగే నడుచుకుంటారు.


మూర్ఖులు: మూర్ఖులతో సహవాసం హానికరమని చాణక్యుడు వివరించాడు. వివేకం లేని వ్యక్తులకు దూరంగా ఉండాలని చాణక్యుడు సలహా ఇచ్చాడు. మూర్ఖులు తీసుకునే చెడు నిర్ణయాలు మీపై ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మీరు స్నేహం చేయండి.





























