Born on Wednesday: బుధవారం పుట్టిన వారు మంచి మాటకారి.. వృత్తి, ఆరోగ్యంలతో పాటు పరిహారాలు తెలుసుకోండి..

బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా శక్తివంతమైనవారు. బుధవారం జన్మించిన వ్యక్తులు బుధ గ్రహంచే ప్రభావితమవుతారు. అందుకనే వీరి మాటల్లో మాధుర్యం ధ్వనిస్తుంది. మనస్సు విశ్లేషణాత్మక విధానాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. గణితం, లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టులు ఈ రోజు జన్మించేవారికి ఇష్టమైన సబ్జెక్ట్‌లు అవ్వొచ్చు.

Born on Wednesday: బుధవారం పుట్టిన వారు మంచి మాటకారి.. వృత్తి, ఆరోగ్యంలతో పాటు పరిహారాలు తెలుసుకోండి..
Born On Wednesday
Follow us
Surya Kala

|

Updated on: Apr 12, 2023 | 7:31 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మనిషి పుట్టిన తేదీతో పాటు, పుట్టిన రోజు కూడా జీవితంపై చాలా ప్రభావం పడుతుంది. వారంలో బుధవారం వారంలో నాల్గవ రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. బుధవారం వచ్చే సరికి ఇప్పటికే వారంలో రెండు రోజులు గడిచిపోతాయి. శక్తి స్థాయి పూర్తి స్వింగ్‌లో ఉంటుంది. అంతేకాదు.. అనేక సమావేశాలతో బిజీగా ఉంటారు. బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా శక్తివంతమైనవారు. బుధవారం జన్మించిన వ్యక్తులు బుధ గ్రహంచే ప్రభావితమవుతారు. అందుకనే వీరి మాటల్లో మాధుర్యం ధ్వనిస్తుంది. మనస్సు విశ్లేషణాత్మక విధానాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. గణితం, లాజికల్ రీజనింగ్ వంటి సబ్జెక్టులు ఈ రోజు జన్మించేవారికి ఇష్టమైన సబ్జెక్ట్‌లు అవ్వొచ్చు. ఈ రోజు బుధవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రేమ వ్యవహారం, కెరీర్ గురించి వివరంగా తెలుసుకుందాం..

బుధవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం బుధవారం జన్మించిన వ్యక్తుల జీవితంపై బుధుడి ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని వాక్కుకు అధిపతి అంటారు. బుధవారం పుట్టిన వారికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వ్యక్తిత్వం చాలా బహుముఖంగా ఉంటుంది. బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు తమ ముందు ఏమి జరిగినా పట్టించుకోరు. ఎక్కువగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఒకే చోట స్థిరంగా ఉండడం చాలా కష్టముగా భావిస్తారు.  బుధవారం జన్మించిన వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త భాషలను నేర్చుకోవడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి.. అనేక భాషల పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఈ రోజు జన్మించిన వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టతరం.  ఒకదాని తర్వాత మరొకటి ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.

బుధవారం జన్మించిన వ్యక్తుల వృత్తి బుధవారం జన్మించిన వ్యక్తుల తెలివితేటలు ..  ప్రసంగం రెండు అందమైన కలయిక. అంతే కాదు వీరికి లాజికల్ మైండ్ ఉంటుంది.  ఏదైనా సమస్యకు తార్కిక పరిష్కారాన్ని కనుగొనడంలో బుధుడు సహాయపడతాడు. ప్రసంగం లేదా గణితాన్ని ఎక్కువగా వృత్తిగా స్వీకరించడానికి ఆసక్తిని చూపిస్తారు. కమ్యూనికేషన్‌కు సంబంధించిన అన్ని రకాల కెరీర్‌లు వీరికి మంచివి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడతారు.. కనుక కొత్త టెక్నాలజీ ఎల్లప్పుడూ కెరీర్‌లో వీరికి మంచి సహాయకారి. అనేక భాషల పరిజ్ఞానం వల్ల లాంగ్వేజ్ ఆఫీసర్, ట్రాన్స్‌లేటర్, రైటింగ్, జర్నలిజం వంటి కెరీర్‌లు కూడా మీకు మేలు చేస్తాయి. వీరి విశ్లేషణాత్మక విధానంతో ఫైనాన్స్‌కు సంబంధించిన వివిధ రకాల కెరీర్‌లను కొనసాగించవచ్చు. వ్యాపార రంగంలో అడుగు పెట్టవచ్చు. అంతేకాదు టెలిఫోన్, టెలిగ్రాఫ్, ఇ-మెయిల్, సంబంధించిన పనిని కూడా చేయవచ్చు. అనేక మంది విజయవంతమైన కళాకారులు, శిల్పులు, విక్రేతలు కూడా బుధవారం జన్మించారు.

ఇవి కూడా చదవండి

బుధవారం జన్మించిన వ్యక్తుల ప్రేమ జీవితం బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణ ప్రేమ జీవితం కంటే మెరుగ్గా ఉంటారు. వాస్తవానికి.. వీరు మంచి మాటకారి. ఈ మాటకారి తనంతో ప్రేమికులను ఎప్పుడు, ఎక్కడ .. ఎలా ఒప్పించాలో వీరికి బాగా తెలుసు. వీరికి ప్రయాణం అంటే ఇష్టం.. కనుక ఖచ్చితంగా తమ ప్రేమికుడితో పదే పదే చిన్న టూర్‌కు వెళ్లాలనుకుంటారు. దీంతో ఎల్లప్పుడూ ప్రేమికులను ఒకరికొకరు చాలా దగ్గరఅవుతారు.    చాలా అందమైన విషయాలతో  తమ జీవిత భాగస్వామిని సులభంగా ఒప్పించగలరు. అయితే, కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడే అలవాటు కారణంగా. అవతలి వారు కూడా బాధపడవచ్చు.

బుధవారం జన్మించిన వారి ఆరోగ్యం బుధవారం పుట్టిన వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చాలా సార్లు బుధవారం జన్మించిన వ్యక్తులు ముందుగానే మానసిక వ్యాధులు లేదా డిప్రెషన్‌కు గురవుతారు. అంతేకాదు కుష్టు వ్యాధి, చర్మానికి సంబంధించిన వ్యాధులు, జీర్ణ అవయవాలకు సంబంధించిన వ్యాధులు ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో.. వీరు తమ జీవనశైలిని చాలా సమతుల్యంగా ఉంచుకోవాలి.

బుధవారం జన్మించిన వ్యక్తుల అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య బుధవారం పుట్టిన వారి లక్కీ కలర్ ఆకుపచ్చ. అదే సమయంలో అటువంటి వారికి సంఖ్య 5 చాలా అదృష్టం. ఏదైనా సమావేశం లేదా ఏదైనా ప్రత్యేక ఇంటర్వ్యూ సమయంలో ఆకుపచ్చ లేదా లేత ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఇది మీ విజయావకాశాలను పెంచుతుంది.

బుధవారం పుట్టిన వారికి పరిహారాలు బుధవారం జన్మించినట్లయితే.. మీరు గణేషుడు, దుర్గమ్మను శివుని పూజించాలి. బుధవారం పేదలకు పచ్చని వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. శివుడు సమస్త గ్రహాలకు అధిపతి. బుధవారం నాడు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే ధన, ఆస్తిలో ఇబ్బందులు తొలగిపోతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ