మృతకణాలను తొలగించే ఎర్రపప్పు పూత! ఇంట్లోనే ఈజీగా హెయిర్ రిమూవల్‌ స్క్రబ్‌లా కూడా..

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి 15 నిమిషాల తర్వాత కడగాలి. మసూర్ పప్పు ప్యాక్‌లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.

మృతకణాలను తొలగించే ఎర్రపప్పు పూత! ఇంట్లోనే ఈజీగా హెయిర్ రిమూవల్‌ స్క్రబ్‌లా కూడా..
Masoor Dal Face Pack
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 17, 2023 | 12:58 PM

మసూర్ దాల్ : అందమైన మెరిసే చర్మం కలిగి ఉండాలనేది ప్రతి ఒక్కరి కోరిక. సాధారణంగానే చర్మాన్ని సంరక్షించుకునేందుకు వివిధ రకాలైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడుతుంటారు. ఇది మన చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుందనే భ్రమలో ఉంటాము. కానీ ఇది మీ చర్మ ఆరోగ్యానికి కొంచెం ప్రమాదకరం అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఇటీవలి రోజుల్లో పరిస్థితి చూస్తుంటే కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా చర్మం మెరుపు కోల్పోతోంది. దీనికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఇంటి చిట్కాలతో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎర్రపప్పు (మసూర్ దాల్) ఒక ప్రోటీన్ రిచ్ డాల్. ఈ మసూర్ పప్పును ఫేస్ ప్యాక్‌లు చేయడానికి కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఇటువంటి ప్యాక్‌లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. డెడ్ స్కిన్ సెల్స్ ఎక్స్‌ఫోలియేట్, స్మూత్ స్కిన్ టెక్స్‌చర్, చర్మం మునుపటి కంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు, జిడ్డు చర్మం, పొడిబారిన చర్మాన్ని పోగొట్టి ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి మసూర్ దాల్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

తేనెతో మసూర్ దాల్.. ఒక టీస్పూన్ మసూర్ దాల్ పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. రెండింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి 15 నిమిషాల తర్వాత కడగాలి. మసూర్ పప్పు ప్యాక్‌లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

1 టీస్పూన్ మసూర్ పప్పు, 1 టీస్పూన్ బియ్యప్పిండిని తీసుకుని అందులో 2-3 చుక్కల బాదం నూనె వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రామాన్ని మీ ముఖానికి పట్టించి 5 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై వెంట్రుకలు తొలగిపోతాయి. సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగిస్తుంది. సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేయడంతో పాటు ఇది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.

ఎర్రపప్పులోని పోషకాల కారణంగా ఇది చర్మం ముడతలు, అకాల వృద్ధాప్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మసూర్ పప్పు ముఖ్యంగా టాన్ లైన్స్, డార్క్ స్పాట్‌లను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. మసూర్ పప్పులో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మసూర్ పప్పు ఫేస్ ప్యాక్‌లు మీ చర్మాన్ని పోషించడంలో, చర్మకాంతిని నిలుపుకోవడంలో సహాయపడతాయి .

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..