Mango: మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో కాసేపు నానబెడుతుంటారు.. ఎందుకో తెలుసా?

పండ్లలో సెలబ్రిటీ హోదా దేనికైనా ఉందంటే అది మామిడిపండుకే దక్కుతుంది. దీని రాకకోసం ఏడాదంతా ఆశగా ఎదురుచూసే అభిమానులుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక వేసవికాలం రాగానే గుర్తొచ్చేవి కూడా మామిడి పండ్లే. ఐతే మామిడి పండ్లను తినడానికి మన ఇళ్లల్లో ఏళ్ల తరబడి కొన్ని నియమ నిబంధనలు..

Mango: మామిడి పండ్లను తినే ముందు నీళ్లలో కాసేపు నానబెడుతుంటారు.. ఎందుకో తెలుసా?
Mango Health Benefits
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2023 | 12:56 PM

పండ్లలో సెలబ్రిటీ హోదా దేనికైనా ఉందంటే అది మామిడిపండుకే దక్కుతుంది. దీని రాకకోసం ఏడాదంతా ఆశగా ఎదురుచూసే అభిమానులుంటారంటే అతిశయోక్తి కాదు. ఇక వేసవికాలం రాగానే గుర్తొచ్చేవి కూడా మామిడి పండ్లే. ఐతే మామిడి పండ్లను తినడానికి మన ఇళ్లల్లో ఏళ్ల తరబడి కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటారు పెద్దలు. ముఖ్యంగా పండిన మామిడి పండ్లను తినడానికి ముందు కొంత సేపు నీళ్లలో నానబెట్టాలని ఇంట్లో బామ్మలు, తాతలు చెబుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకో తెలియకుండానే ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. నిజానికి చాలా మంది ఈ నియమాన్ని అనుసరిస్తారు కానీ ఎందుకు చేస్తారో మాత్రం తెలియదు.

మామిడికాయలను తినడానికి ముందు కనీసం గంటసేపు నీళ్లలో నానబెట్టి తినాలని అమ్మమ్మల కాలం నుంచి ఇంట్లో సలహాలు ఇస్తుంటారు. నిజానికి అలా చేయడానికి ఓ శాస్త్రీయ కారణం ఉంది. తినడానికి ముందు మామిడికాయలను నీటిలో నానబెట్టినట్లయితే, అది శరీరంలో ఉత్పత్తి అయ్యే అదనపు ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. ఫైటిక్ యాసిడ్‌ అనేది వివిధ రకాల కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌లలో కనిపించే సహజ సమ్మేళనం. ఇది శరీరంలోకి వెళితే శరీరానికి మంచిదేకానీ, ఎక్కువైతే మాత్రం శరీరంలో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. మామిడికాయలను నీటిలో నానబెట్టడం వల్ల ఈ ఆమ్లం తొలగిపోయి శరీరంలో వేడి పెరగకుండా చేస్తుంది. మామిడిని తినడానికి ముందు గంట సమయంపాటు నీళ్లలో నానబెట్టడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది.

దానిలోని స్కిన్‌ అలర్జీలకు (చర్మ సమస్యలు) కారణమయ్యే సాప్ ఆయిల్ నీళ్లలో నానబెడితే తొలగిపోతుంది. ఒకవేళ మామిడి పండ్లను నీళ్లలో సరిగ్గా నానబెట్టకపోతే చర్మసమస్యలు వస్తాయి. మామిడిపండ్లను నీళ్లలో నానబెట్టి తింటే అందులోని కొంత నూనె తొలగిపోయి దురద, మంట వంటి చర్మ సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా మామిడి పండ్లను నానబెట్టడానికి మరొక కారణం ఏంటంటే.. వాటి రుచి పెరుగుతుంది. మామిడిని నానబెట్టడం వల్ల అది రీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా దాని సహజమైన తీపి, తియ్యని వాసన పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.