Sugarcane Juice: వేసవిలో చెరకు రసం.. మేలేకాదు కీడు కూడా చేస్తుంది..! ఇలాంటి వాళ్లు తాగితే అంతే సంగతులు.. 

వేసవి మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతలపానియాలు, పండ్ల రసాలు సేవించడం పరిపాటే. ఈ కాలంలో ఎంతోమంది చెరకు రసం ఇష్టంగా తాగుతుంటారు. రుచికిమాత్రమేకాకుండా, రిఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంటుంది. ఇక చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు..

Sugarcane Juice: వేసవిలో చెరకు రసం.. మేలేకాదు కీడు కూడా చేస్తుంది..! ఇలాంటి వాళ్లు తాగితే అంతే సంగతులు.. 
Side Effects Of Sugarcane Juice
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2023 | 12:12 PM

వేసవి మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి శీతలపానియాలు, పండ్ల రసాలు సేవించడం పరిపాటే. ఈ కాలంలో ఎంతోమంది చెరకు రసం ఇష్టంగా తాగుతుంటారు. రుచికిమాత్రమేకాకుండా, రిఫ్రెష్‌గా కూడా అనిపిస్తుంటుంది. ఇక చెరకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సత్వర శక్తి అందించి ఒంట్లో నిస్సత్తువను తరిమేస్తుంది. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అంతేకాకుండా చెరకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఐరన్‌ కంటెంట్‌, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలకు బలాన్ని చూకూర్చడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మర్చిపోయి కూడా చెరకు రసం తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలతో పాటు హాని తలపెట్టే కారకాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏయే వ్యాధులున్నవారు తాగకూడదంటే..

మధుమేహం

చెరకు రసంలో సహజ చక్కెర శాతం అధికంగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల రక్తంలో చక్కెర కంటెంట్‌ ఒక్కసారిగా పెరుగుతుంది. అందుకే షుగర్‌ వ్యాధితో బాధపడేవారు చెరుకు రసం సేవించడం హానికరం.

కిడ్నీ సమస్యలు

చెరకు రసంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ప్రమాదకరం .

ఇవి కూడా చదవండి

కాలేయ వ్యాధి

చెరకు రసం తాగడం వల్ల కాలేయం మీద ఒత్తిడి పడుతుంది. ఇది కాలేయ వ్యాధి ఉన్నవారికి మరింత హాని తలపెడుతుంది.

తల నొప్పి

తల నొప్పి సమస్యలతో పోరాడే వారు చెరుకు రసం తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు చెరుకు రసం తాగకపోవడం మంచిది. ఒకవేళ తాగితే తలనొప్పితోపాటు తల తిరగడం వంటి ఇతర సమస్యలు ప్రారంభమవుతాయి.

జలుబు

ఫ్లూ లేదా జ్వరం ఉంటే చెరుకు రసం తాగకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి సమయాల్లో చెరకు రసం తాగితే గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్‌ చేయండి.