పల్లెటూర్లలో మునగ చెట్టు ఉండని గడప ఉండదు. మునగ పోషకాల గని. మునకాయల్లోనే కాదు మునగాకు తిన్నా ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. ఎముకలకు బలం చేకూర్చడం, రక్తపోటు నియంత్రణలో ఉంచడం, జీర్ణశక్తి మెరుగవడం.. వంటి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.