- Telugu News Photo Gallery Cricket photos MI vs KKR: Sara Tendulkar cheers for brother Arjun Tendulkar as he makes IPL debut, Photos goes viral
IPL 2023: తమ్ముడు గ్రౌండ్‌లో.. స్టాండ్స్‌లో సారా.. అర్జున్ ఫస్ట్ మ్యాచ్ చూసేందుకు తరలివచ్చిన సచిన్ ఫ్యామిలీ
అర్జున్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సచిన్‌తో పాటు ఆయన సతీమణి అంజలి, కూతురు సారా టెండూల్కర్ వాంఖడే స్టేడియానికి వచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Updated on: Apr 17, 2023 | 8:58 AM

సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా KKRతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు.

అర్జున్ టెండూల్కర్ గత 2 సీజన్‌లుగా ముంబై ఇండియన్స్ జట్టులో ఉంటున్నాడు. అయితే మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది.

ఇప్పుడు సొంత మైదానంలోనే అరంగేట్రం చేశాడు. అంతేకాదు కోల్‌కతా ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్ వేసే అవకాశం కూడా అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ మొత్తం 17 పరుగులు ఇచ్చాడు. తన పెర్ఫామెన్స్‌తో ఓకే అనిపించుకున్నాడు.

కాగా ఆల్ రౌండర్ అయిన అర్జున్‌కు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విధించిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కాగా అర్జున్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు సచిన్‌తో పాటు ఆయన సతీమణి అంజలి, కూతురు సారా టెండూల్కర్ వాంఖడే స్టేడియానికి వచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.




