Venkata Chari |
Updated on: Apr 16, 2023 | 8:07 PM
అర్జున్ టెండూల్కర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ధరించాలని కలలు కంటున్న ముంబై క్యాప్.. ఐపిఎల్ 2023లో 22 వ మ్యాచ్‌లో దక్కింది.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో అర్జున్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడిని 2021లో తొలిసారిగా రూ.20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది.
గాయం కారణంగా అర్జున్ 2021లో లీగ్‌కు దూరమైనప్పటికీ.. 2022లో ముంబై అతన్ని మళ్లీ కొనుగోలు చేసింది. కానీ, అతను అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందలేకపోయాడు. సీజన్ మొత్తం బెంచ్ మీద కూర్చొనే ఉన్నాడు.
ఐపీఎల్ 2023లో అర్జున్ నిరీక్షణ ముగిసింది. 2 మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై అతనికి అరంగేట్రం అవకాశం ఇచ్చింది. అంతకుముందు మైదానంలో తన తోటి ఆటగాళ్లకు నీళ్లు అందిస్తూ కనిపించాడు.
టాస్‌కు ముందు, ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ అతనికి అరంగేట్రం క్యాప్ అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అర్జున్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 24తో బరిలోకి దిగాడు. ఏప్రిల్ 24న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. అర్జున్ తన జెర్సీ నంబర్‌ను తన తండ్రికి అంకితం చేశాడు.