- Telugu News Sports News Cricket news Ipl 2023 rohit sharma surpasses shikhar dhawans record to become the leading run scorer against a single team in ipl
IPL 2023: రోహిత్ శర్మ దెబ్బకు ధావన్ ప్లేస్ ఢమాల్.. లిస్టులో కింగ్ కోహ్లీ కూడా..
Rohit Sharma: జట్టుకు ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ 13 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యేక రికార్డ్ నెలకొల్పాడు.
Updated on: Apr 17, 2023 | 8:11 PM

ఐపీఎల్ 22వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 13 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. దీంతో ప్రత్యేక రికార్డ్ నెలకొల్పాడు.

KKRపై రోహిత్ 20 పరుగులు చేసి IPLలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై హిట్‌మ్యాన్ 1033 పరుగులు చేశాడు. ఇది ఒక రికార్డు.

రోహిత్ శర్మ KKRపై నాలుగు సెంచరీలు చేశాడు. 51.65 సగటు, 133.59 స్ట్రైక్ రేట్‌తో 1033 పరుగులు చేశాడు.

అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌పై 1029 పరుగులు చేసిన శిఖర్ ధావన్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐతే వీరిద్దరి తర్వాత ఈ రికార్డును లిఖించిన ఇద్దరు ఆటగాళ్లపై దృష్టి సారిస్తాం.

ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ వార్నర్.. కేకేఆర్‌పై 1018 పరుగులు చేసి మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్‌పై 1005 పరుగులు చేసి 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా, కింగ్ కోహ్లీ చెన్నైపై 979 పరుగులు చేశాడు.




