AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మతనానికి కలంకం.. 29 రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టిన కసాయి తల్లి

కడుపున నవమాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో తానే హతమార్చింది ఆ కసాయి తల్లి. అడ్డనుకుందో.. వద్దనుకుందో బతికుంగానే కళ్లు కూడా తెరవని 29 రోజుల పసిబిడ్డను బతికుండగానే పాతిపెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన..

అమ్మతనానికి కలంకం.. 29 రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టిన కసాయి తల్లి
Mother Killed Her Baby
Srilakshmi C
|

Updated on: Apr 17, 2023 | 10:24 AM

Share

కడుపున నవమాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో తానే హతమార్చింది ఆ కసాయి తల్లి. అడ్డనుకుందో.. వద్దనుకుందో బతికుంగానే కళ్లు కూడా తెరవని 29 రోజుల పసిబిడ్డను బతికుండగానే పాతిపెట్టింది. ఈ షాకింగ్‌ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కొరటూరు ప్రాంతానికి చెందిన సంచార తెగకు చెందిన కుమరేశన్ (32) రెండో భార్య సంగీత (26). కుమరేశన్‌కు తొలుత రాజేశ్వరి అనే మహిళతో వివాహంకాగా వారికి నలుగురు కుమారులు సంతానం. ఐతే అప్పటికే పెళ్లయిన సంగీత అనే మహిళతో పరిచయం ఏర్పరచుకున్న కుమారేశన్‌ ఆమెను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పుదువై క్రైమంబక్కంలోని కమ్యూనిటీ హాల్ సమీపంలోని ఖాళీ స్థలంలో కాపురం పెట్టారు. 8 నెలల గర్భవతిగా ఉన్ననప్పుడే సంగీతకు ప్రసవం అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బబిత అనే పేరు కూడా పెట్టుకున్నారు. కేవలం 29 రోజుల పసిబిడ్డ శనివారం రాత్రి కనిపించకుండా పోవడంతో కుమరేశన్‌ పరిసర ప్రాంతాల్లో గాలించసాగాడు.

ఈ క్రమంలో ఏప్రిల్ 16వ తేదీన పుదుకుప్పం బీచ్‌లో ఓ మద్యం దుకాణం వెనుక ఇసుకలో చేతులు, కాళ్లు బయటికి కనిపించేలా ఇసుకలో పూడ్చివేసిన చిన్నారి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న క్రిమాంబాక్కం అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయకుమార్‌ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతి చెందిన చిన్నారి సంగీత బిడ్డ అని తేలింది. వారిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా సంగీత నేరం అంగీకరించింది. ఏప్రిల్‌ 15వ తేదీ రాత్రి కుమారేశన్‌, సంగీతకు వాగ్వాదం జరిగింది. ఈ బిడ్డ తనకు పుట్టలేదంటూ కుమారేశన్‌ దుర్భాషలాడటంతో సంగీత భయభ్రాంతులకు గురైంది. దీంతో మద్యం మత్తులో ఉన్న కుమారేశన్‌కు తెలియకుండానే చిన్నారిని బతికుండగానే బీచ్‌లో గుంత తీసి పూడ్చిపెట్టినట్లు పోలీసులకు తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.