Mercedes Car : ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెజ్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు.. ‘పిల్లను చెడగొడ్తున్నారంటూ నెటిజన్ల ఫైర్‌’

చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యనివాళ్లు ఈ జిందగీలో బహుశా ఉండరేమో.. కడుపునొప్పి, దొంగ జ్వరం.. ఇలా కుంటిసాకులు చెప్పి ప్రతిఒక్కరూ స్కూల్‌కి ఎగనామం పెట్టడానికి ప్రయత్నించిన వాళ్లే. ఐతే తల్లిదండ్రులు చాక్లెట్‌, బిస్కెట్లు, బొమ్మలు ఇలా ఏదోఒకటి ఇచ్చి బుజ్జగించి..

Mercedes Car : ఐదేళ్ల చిన్నారికి మెర్సిడెజ్‌ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తల్లిదండ్రులు.. 'పిల్లను చెడగొడ్తున్నారంటూ నెటిజన్ల ఫైర్‌'
Mercedes Car
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2023 | 11:45 AM

చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లనని మారం చెయ్యనివాళ్లు ఈ జిందగీలో బహుశా ఉండరేమో.. కడుపునొప్పి, దొంగ జ్వరం.. ఇలా కుంటిసాకులు చెప్పి ప్రతిఒక్కరూ స్కూల్‌కి ఎగనామం పెట్టడానికి ప్రయత్నించిన వాళ్లే. తల్లిదండ్రులు చాక్లెట్‌, బిస్కెట్లు, బొమ్మలు ఇలా ఏదోఒకటి ఇచ్చి బుజ్జగించి స్కూల్‌కి పంపేపారు. ఐతే ఈ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం కొంచెం వెరైటీ. బడికి వెళ్లనని కూతురు ఏడుస్తుంటే ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి లగ్జరీ కారు కొనిచ్చారండీ. అంతే కూతురు ఎగిరి గంతేసి చక్కా స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించింది. ఇంతకీ ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందంటే..

మలేషియాకు చెందిన పారిశ్రామికవేత్త ఫర్హానా జహ్రాకు ఐదేళ్ల కుమార్తె ఫాతిమా ఒక్కతే సంతానం. అనారోగ్యంతో కూతురు ఫాతిమా జనవరిలో స్కూల్‌కి వెళ్లడం మానేసింది. ఆరోగ్యం కోలుకున్న తర్వాత స్కూల్‌కి వెళ్లనని మారం చేయసాగింది. ఐతే కూతురిని తిరిగి స్కూల్‌కి ఎలా పంపాలా అని తల్లి ఆలోచించిన ఫర్హానా తన రాబోయే పుట్టిన రోజుకి ఏం గిఫ్ట్ కావాలంటూ కుమార్తె ఫాతిమాను అడిగింది. తనకు బీఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిడెస్ జి వ్యాగన్ కావాలని, అది ఇస్తే రోజూ స్కూల్‌కి వెళ్తానని ఐదేళ్ల చిన్నారి తల్లి ఫర్హానాకు చెప్పింది. అన్నమాట ప్రకారం ఫాతిమా పుట్టిన రోజుకు లగ్జరీ ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇచ్చింది. దీంతో తన కోరిక నెరవేరడంతో చిన్నారి స్కూల్‌ వెళ్లి బాగా చదువుకుని, డాక్టర్‌ అవుతానని తల్లిదండ్రులకు ప్రామిస్‌ చేసింది.

స్కూల్‌కు వెళ్లేందుకు తన కూతురిని ప్రోత్సహించేందుకు తన భర్త ఈ కారును బహుమతిగా ఇచ్చినట్లు ఫర్హానా స్థానిక మీడియాకు తెల్పింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదేళ్ల చిన్నారిని పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆ చిన్నారి ఎంతో అదృష్టవంతురాలని కొందరు అభినందిస్తుంటే.. అడిగినవన్నీ కొనిచ్చి తల్లిదండ్రులు ఆమెను చెడగొడుతున్నారని మరికొందరు విమర్శించారు. పిల్లల కలలు నెరవేర్చడం తప్ప పెద్దవాళ్లకు ముఖ్యమైన పనులు ఏముంటాయ్‌? ఇంతకీ మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ