AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీపుతో పాటు నీటిలో మునిగిపోయిన మహిళ.. 18 నిమిషాల తర్వాత సజీవంగా..ఆమె అద్భుతం..!

నీటిలో మునిగితే గరిష్టంగా 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే బతకగలుగుతారు. కానీ, ఇక్కడ ఈ మహిళ మృత్యుంజయురాలిగా మారింది. జీపు మునిగిపోయిన 18-19 నిమిషాల తర్వాత కూడా ఆ మహిళ ప్రాణాలతో తిరిగి రావడం అద్భుతం.

జీపుతో పాటు నీటిలో మునిగిపోయిన మహిళ.. 18 నిమిషాల తర్వాత సజీవంగా..ఆమె అద్భుతం..!
Woman Who Was Alive
Jyothi Gadda
|

Updated on: Apr 17, 2023 | 11:11 AM

Share

మృత్యువు ఎప్పుడు ఎవర్ని ఎలా బలితీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎవరూ ఊహించనూ లేరు కూడా. కానీ, కొన్ని సందర్భాల్లో చావు అంచులదాకా వెళ్లి కూడా కొందరు మృత్యువును జయించి జీవిస్తారు. ఇలాంటి ఘటనే అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. గత శుక్రవారం టెక్సాస్ సమీపంలోని యారో లేక్ ఓ పైన్స్‌లో గుర్తు తెలియని వాహనం నీటిలో మునిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఎమర్జెన్సీ ఆపరేషన్ టీమ్, పోలీసులు అప్రమత్తమయ్యారు. సరస్సు నుండి జీపును బయటకు తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సరస్సు తీరానికి 40 మీటర్ల దూరంలో ఉన్నందున జీపును బయటకు తీయడం కష్టంగా మారింది. అక్కడ్నుంచి టోయింగ్ ట్రక్కు రావడానికి 18 నిమిషాలు పడుతుంది. అయితే, జీపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని బయటపడ్డారా.? లేక జీపులోనే ఉండిపోయారో తెలియదు.. ఉంటే మాత్రం బతికే అవకాశం లేదని భావించారు సహాయక సిబ్బంది. ఏదేమైన హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు. అంచెలంచెలుగా ఆపరేషన్ మొదలుపెట్టారు. జాలరి పడవ తాడు, హుక్ సహాయంతో జీపును ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు.

జీపు మెల్లగా సరస్సు నుండి పైకి వచ్చింది. డ్రైవింగ్ సీటు సరస్సులోంచి బయటికి రాగానే అక్కడున్నవారు ఒక్క క్షణం ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే జీపు ముందు సీటులో ఓ మహిళ కనిపించింది. మరీ ముఖ్యంగా, ఆమె సజీవంగా ఉంది. ఇప్పుడు ఆపరేషన్ వేగం పెరిగింది. అప్పుడే ఒడ్డుకు చేరిన మత్స్యకారుల పడవ మళ్లీ జీపు వైపు దూసుకుపోయింది. జీపు తలుపు తీసేసి మహిళను పడవలోకి దింపి ఒడ్డుకు చేర్చి పోలీస్ జీపులో వెచ్చగా ఉంచారు. వెంటనే అంబులెన్స్ తీసుకొచ్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ మహిళ క్షేమంగా ఉంది. ప్రమాదం షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు.

ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. యాక్సిడెంట్ తో జీపు సరస్సులో 40 మీటర్లు ఎలా వెళ్లింది..? 18 నిమిషాల పాటు నీళ్లలో మునిగిపోయినా ఆ మహిళ ఎలా బతికే ఉంది? నీటిలో మునిగితే గరిష్టంగా 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే బతకగలుగుతారు. కానీ, ఇక్కడ ఈ మహిళ మృత్యుంజయురాలిగా మారింది. జీపు మునిగిపోయిన 18-19 నిమిషాల తర్వాత కూడా ఆ మహిళ ప్రాణాలతో తిరిగి రావడం అద్భుతం.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ మహిళ ఎవరని మీడియా ఎంత ప్రయత్నించినా పోలీసులు మాత్రం ఆమె ఎవరనే విషయాన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే ఈ మహిళ కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయింది. మహిళ అదృశ్యంపై టెక్సాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైందని తెలిసింది. అయితే దీని వెనుక వేరే ఇతర కారణాలు కూడా ఉండి ఉండొచ్చని, కాబట్టి పోలీసులు ఆమె వివరాలు వెల్లడించలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..