ఇక వంట చేయడానికి గ్యాస్, కరెంట్ అవసరం లేదు..! ఈ స్పెషల్ స్టవ్ మీ ఇంట్లో ఉంటే చాలు..!!
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్టవ్‌ను ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్టవ్ ఇండియన్ ఆయిల్ గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ పంపుల వద్ద అందుబాటులో ఉంటుందని చెప్పారు.
వంటగ్యాస్ ధర రోజురోజుకూ పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్లు ఖరీదు కావడంతో ఇండక్షన్ స్టవ్ లు, ఓవెన్లు వాడడం ప్రారంభిస్తే కరెంటు ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రత్యేక స్టవ్ మార్కెట్లోకి వచ్చింది. దీన్ని ఉపయోగించడం వల్ల గ్యాస్ లేదా ఇండక్షన్ అవసరం లేదు. ఒక్కసారి ఈ స్టవ్ కొంటే జీవితాంతం ఇంధనం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కాబట్టి ఇది ఖరీదైనదని మీరు అనుకోనవసరం లేదు.
సూర్య నూతన్ సోలార్ స్టవ్ : ద్రవ్యోల్బణంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సాంకేతికతను రూపొందించింది. ఈ కొత్త టెక్నాలజీ సూర్య నూతన్ సోలార్ స్టవ్. ఈ స్టవ్ కొనుగోలు చేయడం ద్వారా మీరు గ్యాస్ లేదా విద్యుత్ ఖర్చు లేకుండా జీవితకాలం వంటచేసుకోగలుగుతారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ఈ స్టవ్‌ను విడుదల చేసింది. సూర్య నూతన్ స్టవ్‌ను వంటగదిలోనే ఉంచి ఉపయోగించవచ్చు.
24 గంటలూ ఉపయోగించవచ్చు : ఈ స్టవ్‌ని 24 గంటలూ ఉపయోగించవచ్చు. ఇది పాత సోలార్ ఓవెన్‌లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ స్టవ్ రెండు యూనిట్లతో తయారు చేయబడింది. ఒక యూనిట్ వంటగదిలో ఏర్పాటు చేస్తారు. మరొక యూనిట్ ఎండలో ఉంచుతారు.. ఈ విధంగా మీరు ఈ స్టవ్‌ను పగలు, రాత్రి ఉపయోగించవచ్చు.
దీని ధర ఎంత : సూర్య నూతన్ సోలార్ స్టవ్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక వేరియంట్ ధర రూ.12,000 కాగా, టాప్ వేరియంట్ రూ.23,000కు అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్టవ్‌ను ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు. అయితే త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ స్టవ్ ఇండియన్ ఆయిల్ గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ పంపుల వద్ద అందుబాటులో ఉంటుందని చెప్పారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..