భక్తికి పరాకాష్ట.. భయంకరమైన ఆత్మత్యాగం.. స్వయంగా తలలు నరుక్కుని దేవుడికి నైవేద్యం పెట్టిన దంపతులు..

అలా విరిగిన రెండూ తలలు కలిసి వెళ్లి మంటల్లో పడి కాలిపోయేలా ఏర్పాటు చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు ఆదివారం తెల్లవారుజామున సమాచారం అందింది. వించియా పోలీస్ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

భక్తికి పరాకాష్ట.. భయంకరమైన ఆత్మత్యాగం.. స్వయంగా తలలు నరుక్కుని దేవుడికి నైవేద్యం పెట్టిన దంపతులు..
Sacrificial Ritual
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 17, 2023 | 9:21 AM

కొంతమందికి అదేం అజ్ఞానమో, అదేం మూఢ భక్తో తెలియదు గానీ, అతీత శక్తులొస్తాయని, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని, ఇంకొందరు ఆత్మలు శాంతిస్తాయని మరికొందరు శివుడు కన్పిస్తాడని కొందరు కన్న బిడ్డలను బలి చేస్తున్నారు. అప్పట్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే అతి కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఉదాంతం తీవ్ర సంచలనం రేపింది. భక్తి ఉండాలి. నమ్మకం ఉండాలి. కానీ మూఢభక్తితో కొందరు సాగిస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా అలాంటి దారుణ సంఘటన ఒకటి గుజరాత్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో తమ తలలను బలి ఇచ్చేందుకు వీలుగా ఇంట్లోనే సృష్టించిన గిలెటిన్‌లాంటి పరికరంతో ఒక వ్యక్తి, అతని భార్య శిరచ్ఛేదం చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు వెల్లడించారు..

దేవుడి మీద భక్తితో మధ్య వయస్కులైన దంపతులు సినిమాటిక్‌గా తల నరికి దేవుడికి సమర్పించిన దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటుచేసుకుంది. ఇలా భార్యాభర్తలు స్వయంగా వారి తలను నరికివేసేందుకు ఇంట్లోనే శిరచ్ఛేదం చేసే యంత్రాన్ని తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని దేవుడికి సమర్పించిన దంపతులను హేముభాయ్ మక్వానా (38), హన్సాబెన్ ( 35)గా గుర్తించారు. ఘటనా స్థలంలో డెత్ నోట్ లభ్యమైంది. అందులో దంపతులు తమ వృద్ధ తల్లిదండ్రులను, ఇద్దరు పిల్లలను బాగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను అభ్యర్థించారు.

రాజ్‌కోట్ జిల్లాలోని వించియా గ్రామానికి చెందిన హేముభాయ్, హన్సాబెన్ దంపతులు గత ఏడాది కాలంగా తమ గుడిసెలో దేవుడికి పూజలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఈ ప్రార్థనకు కొనసాగింపుగా, దంపతులు తమ శరీరాలను దేవునికి సమర్పించాలని నిర్ణయించుకున్నారు. వారి తలను కత్తిరించిన తరువాత, ఆ జంట దానిని అగ్ని ద్వారా నైవేద్యంగా దేవునికి సమర్పించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి తలలు నరికివేసే యంత్రాన్ని తయారు చేసుకున్నారు. అనంతరం యంత్రంలోని తాడును తానే లాగడంతో పదునైన ఆయుధం పై నుంచి కిందకు జారి ఒక్క దెబ్బతో ఇద్దరి తలలు తెగిపోయాయి. అలా విరిగిన రెండూ తలలు కలిసి వెళ్లి మంటల్లో పడి కాలిపోయేలా ఏర్పాటు చేసుకున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులకు ఆదివారం తెల్లవారుజామున సమాచారం అందింది. వించియా పోలీస్ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్యాభర్తలిద్దరూ కలిసి పథకం ప్రకారం వారి తలలు తెగిపోయిన తర్వాత అగ్నిపీఠంలోకి దొర్లినట్లు, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని వించియా సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంద్రజీత్‌సిన్హ్ జడేజా తెలిపారు. అంతా అనుకున్నట్లే జరిగి ఆ దంపతులు చనిపోయారు. దాంతో పోలీసులు సహా ఊరంతా షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం