AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్జరీతో ఐదు అంగుళాల ఎత్తు పెరిగాడు.. రూ. 1.35 కోట్లు పెట్టి మరీ ఆపరేషన్‌..!

రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా, పగలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ డబ్బు సంపాదించాడు. గత నెలలో శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీలో తొడ ఎముకను విరగొట్టి అతికించాల్సి ఉంటుందని డాక్టర్ వివరించారు.

సర్జరీతో ఐదు అంగుళాల ఎత్తు పెరిగాడు.. రూ. 1.35 కోట్లు పెట్టి మరీ ఆపరేషన్‌..!
Leg Lengthening Surgery
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2023 | 4:12 PM

Share

ఒక వ్యక్తి ఐదు అంగుళాల ఎత్తు పెరగడానికి 1.35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. అమెరికాలోని ఓ వైద్యుడు లెగ్ లెంథెనింగ్ సర్జరీ చేసి ఆయనను ఐదు అంగుళాల పొడవు పెంచాడు. ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. అమెరికాలోని మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌కు చెందిన 41 ఏళ్ల మోసెస్ గిబ్సన్, తన డేటింగ్ జీవితాన్ని ఎంజాయ్‌ చేయటం కోసం.. అరుదైన ఆపరేషన్‌ చేయించుకున్నాడు. దాంతో అతడు పొడవుగా పెరిగాడు.

జూన్ నాటికి మోసెస్ తన టార్గెట్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు సాధించడానికి రెండు విధానాలపై మొత్తం $165,000 (రూ. 1.35 కోట్లు) వెచ్చించాడు . మోసెస్ గతంలో కంటే ప్రస్తుతం ఐదు అంగుళాలు పొడవుగా ఉన్నాడు. మోసెస్ పొట్టిగా ఉన్నందున, అతని ప్రేమ జీవితం సమస్యగా మారింది. పైగా అతన్ని అందరూ పొట్టివాడు అని ఆటపట్టించేవారు. కానీ, ఇప్పుడు అతడు ఎత్తుకు ఎదిగి ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు.

ఇవి కూడా చదవండి

మోషే చిన్నప్పుడు 5 అడుగుల 5 అంగుళాల పొడవు ఉండేవాడు. పొడవుగా ఎదగాలనే ప్రయత్నంలో ఆయుర్వేదం, వైద్యం, రకరకాల మందులు వాడినా ఎత్తు పెరగలేదు. ఆపై అతను శస్త్రచికిత్స చేయించుకోవడానికి ముందుకు వచ్చాడు. రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా, పగలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్‌గా పనిచేస్తూ డబ్బు సంపాదించాడు. గత నెలలో శస్త్రచికిత్స జరిగింది. ఈ సర్జరీలో తొడ ఎముకను విరగొట్టి అతికించాల్సి ఉంటుందని డాక్టర్ వివరించారు.

ఈ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ, ఈ సర్జరీ స్వల్ప సమయంలోనే అయిపోతుందని, కానీ, రికవరీ ప్రాసెస్ పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇది కొన్ని నెలలు పడుతుందని చెప్పాడు. ఒక ఇంచు ఎత్తు పెరగడానికి 25 రోజులు పడుతుందని, మిగతా ఇంచుల కోసమే రెండున్నర నెలలు పట్టిందని తెలిపాడు.

ఎత్తు పెంచడానికి పేషెంట్ తొడ ఎమును విరగొడతామని, అందులో అడ్జస్టబుల్ మెటల్ నెయిల్ బిగిస్తామని పేర్కొన్నాడు. ఆ నెయిల్స్ మూడు నెలలపాటు ప్రతి రోజూ కొంత పెరుగుతుందని చెప్పాడు. మ్యాగ్నెటిక్ రిమోట్ కంట్రోల్ సహాయంతో మూడు నెలల్లో ఈ నెయిల్‌ను ఎక్స్‌టెండ్ చేయాల్సి ఉంటుందని వివరించాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
SSC స్టెనో పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా?
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
'ఆయన పార్థివ దేహాన్ని దర్శించే అర్హత కూడా నాకు లేదు'
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. అగ్రనేత హతం..!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఇంకా తేలని TGPSC గ్రూప్‌ 1 వివాదం.. హైకోర్టు తీర్పు మళ్లీ వాయిదా!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!