Pimple Care Tips: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. వారంలో తొలగిస్తుంది..

చేతులతో ఈ స్క్రబ్‌ని ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి, కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. మీరు ఈ స్క్రబ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఫలితం ఒక వారంలోనే కనిపించడం ప్రారంభమవుతుంది.

Pimple Care Tips: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. వారంలో తొలగిస్తుంది..
skin rashes
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 16, 2023 | 2:57 PM

ప్రతి ఒక్కరూ అందంగా, ఆకర్షణీయమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి ఆహారం, జీవనశైలి, కాలుష్యం ముఖానికి చాలా హాని చేస్తాయి. ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. ఈ మొటిమలు తొలగిపోయిన తర్వాత నల్లటి మచ్చలుగా మారుతాయి. ఇది ముఖ సౌందర్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. ముఖం అందాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా స్కీన్‌ కేర్ టిప్స్‌ ఫాలోకావటం అతి ముఖ్యం. లేదంటే బ్లాక్ హెడ్స్ రావడం మొదలవుతుంది. అప్పుడు అవి మచ్చల రూపంలోకి మారుతాయి. సాధారణంగా ప్రజలు తమ ముఖాన్ని శుభ్రం చేయడానికి సబ్బు లేదా ఫేస్ వాష్‌ని ఉపయోగిస్తారు. అయితే ఇంట్లోనే తయారుచేసుకునే ప్రత్యేక రకం స్క్రబ్ వాడితే మొటిమల మచ్చలు మాయమవుతాయి.

స్క్రబ్ ఎలా తయారు చేయాలి?

మీకు జిడ్డు చర్మం ఉన్నట్టయితే, ఒక గిన్నెలో 2 చెంచాల పెరుగు తీసుకోండి, కానీ మీ చర్మం పొడిగా ఉంటే పాలను ఉపయోగించడం మంచిది. ఇప్పుడు దానితో ఓట్స్ కలపండి, ఇది చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం, అర టీస్పూన్ సెమోలినా జోడించండి. ఇది స్క్రబ్‌ను మరింత ప్రయోజనకరంగా మారుస్తుంది. స్క్రబ్ యాంటిసెప్టిక్ చేయడానికి పసుపును కలుపుకోవాలి. రెండు చుక్కల నిమ్మరసం పిండుకుంటే స్క్రబ్ రెడీస.

చేతులతో ఈ స్క్రబ్‌ని ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి, కొంత సమయం తర్వాత ముఖం కడుక్కోవాలి. మీరు ఈ స్క్రబ్‌ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే ఫలితం ఒక వారంలోనే కనిపించడం ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..