- Telugu News Photo Gallery Taj Mahal construction ai generated images went viral have you seen latest Telugu News
తాజ్ మహల్ నిర్మాణ సమయంలో ఎలా ఉందో తెలుసా..? ఆనాటి ఫోటోలు వైరల్..
తాజ్ మహల్ నిర్మాణ దశలో ఉండగా ఎలా ఉందో ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే మీకు తాజ్ అంటే మరింత ఇష్టం, ప్రేమ కలుగుతుంది.
Updated on: Apr 16, 2023 | 11:43 AM

నిజమైన ప్రేమకు చిహ్నంగా, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా, భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా 'తాజ్ మహల్'కు ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు.

ప్రస్తుతం తాజ్ మహల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు తాజ్ మహల్ నిర్మాణ సమయంలో కొన్ని దృశ్యాలను చూపుతున్నాయి. 370 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ తాజ్ మహల్ గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణం తర్వాత మరెవరూ అలాంటి నిర్మాణాన్ని నిర్మించకూడదని షాజహాన్ కూలీల చేతులు నరికివేశాడని చెబుతారు.

ఈ వైరల్ ఫోటోలు తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను చూపుతున్నాయి. ఇందులో కూలీలు పనిచేస్తున్నారు. తాజ్ మహల్ ఎత్తైన మినార్లను ఎలా నిర్మించారో కూడా ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోలు చూస్తుంటే మీరు కూడా మైమరచిపోతారు. తాజ్ మహల్ ను చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడా చూడలేం అనే భావన కలుగుతుంది.

శతాబ్ధాలు గడిచినా నేటికీ చెక్కుచెదరకుండా ఈ నిర్మాణం నిలిచిందంటే అందులో వినియోగించిన సాంకేతికత, నిర్మాణ సామగ్రి ఎంతో ధృడమైనదని నమ్మక తప్పదు. తాజ్ మహల్ నిర్మాణాన్ని వర్ణించే ఈ ప్రత్యేక ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ jyo_john_mulloorలో షేర్ చేశారు.

షాజహాన్ అద్భుతమైన వారసత్వాన్ని రూపొందించడంలో ఒక సంగ్రహావలోకనం. అలాగే, షాజహాన్ అనుమతి తర్వాతే ఈ అరుదైన ఛాయాచిత్రాలను షేర్ చేశామంటూ ఫోటోలకు సరదాగా క్యాప్షన్ రాశారు.
